kumaram bheem asifabad- సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు పాటుపడాలి
ABN , Publish Date - Jul 24 , 2026 | 11:19 PM
జిల్లాలో సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు పాటుపడాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. కలెక్టరేట్‌లో నీతి తారా పోర్టల్ వినియోగం డేటా ఎంట్రీ, డేటా పర్యవేక్షణ, విశ్లేషణలపై జిల్లాస్థాయి అధికారులు, సిబ్బందికి శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి ఆయన హజరయ్యారు.
ఆసిఫాబాద్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు పాటుపడాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. కలెక్టరేట్‌లో నీతి తారా పోర్టల్ వినియోగం డేటా ఎంట్రీ, డేటా పర్యవేక్షణ, విశ్లేషణలపై జిల్లాస్థాయి అధికారులు, సిబ్బందికి శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి ఆయన హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతి ఆయోగ్ అమలు చేస్తున్న ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం, ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమాల లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయడంలో నీతి తారా పోర్టల్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన కీలక పనితీరును సూచికలను నిరంతరం పోర్టల్‌లో నమోదు చేసి వాటిని విశ్లేషించడం ద్వారా జిల్లాలోని అభివృద్ధి సూచికల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను సమర్థవంతంగా వినియోగించాలని తెలిపారు. కార్యక్రమంలో ఈడీఎం గౌతంరాజ్, ఏబీఎఫ్‌లు బాలరాజు, రాజారాం, మాస్టార్ ట్రైనీ నర్సింగ్‌దాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల ప్రదానోపాద్యాయులు బాధ్యతయుతంగా వ్యవహరించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో నిర్వహించిన మూడు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న ఆంశాలను సమర్థవంతంగా పాఠశాలల్లో అమలు చేసి విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను మెరుగు పరిచేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో సచ్చిదానందచారి, కోఆర్డినేటర్లు శ్రీనివాస్, లతీఫ్, శ్రీనివాస్, రిసోర్స్ పర్సన్లు హనుమంతు, ప్రభోద్, నటరాజ్, అమరేందర్‌రెడ్డి, హెచ్‌ఎంలు, కేజీబీవీ ఎస్‌వోలు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.