అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవాలి
ABN , Publish Date - Jun 11 , 2026 | 11:53 PM
అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంక టస్వామి పేర్కొన్నారు.
-మంత్రి వివేక్‌వెంకటస్వామి
చెన్నూరు, జూన్ 11 (ఆంధ్రజ్యోతి) : అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంక టస్వామి పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళక కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో గురువారం చెన్నూరు అటవీ రేంజ్ పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్‌కుమార్ దీపక్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ భావి తరాలకు సమతుల్య వాతావరణాన్ని అం దించడానికి అటవీ ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ ప్రాంతంలోని మొసళ్ల పార్కు, ఇతర ప్రాంతాలను పర్యాటకుల కోసం తీర్చిది ద్దాలని, తద్వారా పర్యాటక ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెంపొందుతాయ న్నారు. రైతుల సంక్షేమం కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొని రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిర్ణీత తేదీ కంటే ముందే లారీలు, హమాలీల సమస్యలను పరిష్కరిం చుకుంటూ కొనుగోలు చేశామన్నారు. నియోజకవర్గంలో మొదటి విడతలో 3,500, రెండో విడత 2 వేల ఇళ్లను మంజూరు చేశామన్నారు. ఇళ్లు నిర్మించు కునే స్థోమత లేని వారికి ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నా మన్నారు. చెన్నూరులో ఐదు పడకలతో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసిన ఇ తర ప్రాంతాలకు కిడ్నీ వ్యాధి గ్రస్థులు వెళ్లకుండా స్థానికంగా వైద్యం అంది స్తు న్నామన్నారు. మండల కేంద్రంలో చేపట్టిన వంద పడకల ఆసుపత్రిలో 23 మంది వైద్యులతో పాటు సిబ్బందిని నియమించి వైద్య పరికరాలు, ఫర్నీచర్ స మకూర్చామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ తివారీ, సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.