kumaram bheem asifabad- మొక్కలు నాటి సంరక్షించాలి
ABN , Publish Date - Jun 18 , 2026 | 10:26 PM
వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటి పరిరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ కె హరిత అన్నారు. రెబ్బెన మండల కేంద్రంలో గురువారం వన మహోత్సవంలో భాగంగా జిల్లా అటవీశాఖ అధికారి బాలమణితో కలిసి మొక్కలు నాటారు.
రెబ్బెన,జూన్ 18 (ఆంధ్రజ్యోతి): వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటి పరిరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ కె హరిత అన్నారు. రెబ్బెన మండల కేంద్రంలో గురువారం వన మహోత్సవంలో భాగంగా జిల్లా అటవీశాఖ అధికారి బాలమణితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచి పర్యావరణాన్ని రక్షించుకోవాలని తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, రహదారులకు ఇరు పక్కల, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణ, ప్రయివేటు సంస్థలు, పరిశ్రమలు, కమ్యూనిటి కేంద్రాలు, వైద్యశాలలు, పాఠశాలలు, కళాశాల ఆవరణలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులు, ప్రజలకు అడిగిన మొక్కలను అందించాలని, మొక్కలు నాటడమే కాకుండా రక్షించాలని తెలిపారు. కార్యక్రమంలో రెబ్బెన అటవీ రేంజ్ అధికారి రవి, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మండల కేంంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్ధుల హాజరు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధుల నమోదు సంఖ్య 100 శాతం ఉండేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, ప్రరయివేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాళలో చేర్చేలా ఉపాధ్యాయులు విద్యార్థుళ తల్లిదండ్రులకు అవగాహణ కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, అల్పాహారం, రుచికరమైన మధ్యాహ్న భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందించటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బాధితులకు న్యాయం చేస్తాం
మండల కేంద్రంలోని రైల్వే భూ బాధితులకు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేస్తామని కలెక్టర్ హరిత అన్నారు. మండల కేంద్రానికి గురువారం వచ్చిన కలెక్టర్‌ను స్థానిక సర్పంచి భరద్వాజ్ ఆధ్వర్యంలో రైల్వే భూ భాధితులు కలెక్టర్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. గత కొన్ని దశాబ్ధాలుగా తాము రోడ్డు పక్కన తాత్కాలిక ఏర్పాట్లతో పాటు పక్కా భవనాలు నిర్మించుకొని చిరు వ్యాపారులు చేసుకుంటు జీవనోపాధిని పొందుతున్నామని చెప్పారు. ఇటీవల రైల్వే అధికారులు తరుచూ ఈ స్థలాలపై విచారణ జరుపడంతో పాటు నిర్మాణాలకు సంబంధించిన కొలతలు తీసుకొని వారి వివరాలను నమోదు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి తమ జీవనోపాధి కోల్పోకుండా చూడాల్సిందిగా వారు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి వరలక్ష్మి, బి.శ్రీధర్, రాజేశ్వర్‌రావు, మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు.