Share News

హక్కుల సాధనకు పోరాడాలి

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:55 AM

హక్కుల సాధనకు పోరా టాలకు సిద్ధం కావాలని ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు కుర్మిద్ద శ్రీనివాస్‌ అన్నారు.

హక్కుల సాధనకు పోరాడాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న ప్రజానాట్య మండలి కళాకారులు

భువనగిరి రూరల్‌, మార్చి 2(ఆంధ్రజ్యోతి): హక్కుల సాధనకు పోరా టాలకు సిద్ధం కావాలని ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు కుర్మిద్ద శ్రీనివాస్‌ అన్నారు. కళాకారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సో మవారం కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కళాకారులకు గుర్తింపుకార్డులు, పారితోషకం అందజేయకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, పీ ఎన్‌ఎం జిల్లా ప్రధాన కార్యదర్శ చెక్క వెంకటేశ్‌ మాట్లాడుతూ 50 సంవత్సరా లు నిండిన కార్మికుడికీ రూ. 6వేల పింఛన్‌, సంస్కృతిక రంగానికి ప్రత్యేకంగా రూ.1000కోట్ల బడ్జెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నా యకులు ఎండీ. ఇమ్రాన్‌, చిగుర్ల లింగం, వెంకటేశ్‌, బి. నర్సింహ, హేమలత, యాదగిరి, ప్రవీణ్‌, సోంనర్సయ్య, పోచయ్య, రాజప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2026 | 12:55 AM