Share News

కాలనీల్లో సమస్యల్లేకుండా చూడాలి

ABN , Publish Date - May 30 , 2026 | 11:27 PM

అచ్చం పేట పట్టణంలోని శివసాయినగర్‌ కాలనీ, మధు రానగర్‌ కాలనీల్లో శనివారం ఉదయం ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ మార్నింగ్‌ వాక్‌ నిర్వహించారు.

కాలనీల్లో సమస్యల్లేకుండా చూడాలి
అచ్చంపేట : మధురానగర్‌లో మల్లుకున్న వర్షపు నీటిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

- అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే

- అచ్చంపేట పట్టణంలో వంశీకృష్ణ మార్నింగ్‌ వాక్‌

అచ్చంపేట, మే 30 (ఆంధ్రజ్యోతి) : అచ్చం పేట పట్టణంలోని శివసాయినగర్‌ కాలనీ, మధు రానగర్‌ కాలనీల్లో శనివారం ఉదయం ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ మార్నింగ్‌ వాక్‌ నిర్వహించారు. కాలనీల్లో పర్యటించి ఎమ్మెల్యే స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలు, అవస రాలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో తాగు నీరు, పారిశుధ్యం, రోడ్లు, వీధి దీపాలు, తదితర సమస్యలపై నివాసితులు ఎమ్మెల్యే దృష్టికి తీసు రాగ, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశిం చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కాలనీల్లో వర్షపునీరు నిల్వ ఉండడంతో స్థా నిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల ను ఎమ్మెల్యే ప్రత్యక్షంగా పరిశీలిం చారు. అనంతరం సాయినగర్‌ కాల నీలోని మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ కమి షనర్‌ మురళి, మాజీ కౌన్సిలర్‌ సునీ త శ్రీనివాస్‌రెడ్డి, టౌన్‌ అధ్యక్షుడు ఖా దర్‌, నాయకులు గోపాల్‌రెడ్డి, మల్లేష్‌, రామనాథం, రాములు, లక్ష్మణ్‌, నాయ కులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

సొంతగూటికి చేరిన బీజేపీ నాయకులు

పదర, (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలో పలువురు బీజేపీకి ముఖ్య నాయకులు అచ్చం పేట నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షం లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కండువా కప్పి వా రిని ఎమ్మెల్యే ఆహ్వానించారు. వంకేశ్వరం గ్రామానికి చెందిన నల్ల ప్రవీణ్‌, తిరుపతయ్యలు బీజేపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్య క్రమంలో పదర మండల అధ్యక్షుడు బంగారి మాణిక్యం, వంకేశ్వరం గ్రామ అధ్యక్షుడు రామయ్య, మాజీ ఎంపీటీసీ రామ్మూర్తి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మల్లయ్య, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2026 | 11:27 PM