kumaram bheem asifabad- ఒక్క ఓటు పోకుండా చూడాలి
ABN , Publish Date - Jul 11 , 2026 | 10:45 PM
సర్ ప్రక్రియలో ఒక్క ఓటు మిస్ కాకుం డా చూడాలని ఇందులో బీఏల్‌ఏ(బూత్ లెవల్ ఏజెంట్)ల పాత్ర కీలకమని మం త్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శనివారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అధ్యక్షతన నిర్వహించిన బీఎల్‌ఏల అవగాహన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు
- జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు
ఆసిఫాబాద్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): సర్ ప్రక్రియలో ఒక్క ఓటు మిస్ కాకుం డా చూడాలని ఇందులో బీఏల్‌ఏ(బూత్ లెవల్ ఏజెంట్)ల పాత్ర కీలకమని మం త్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శనివారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అధ్యక్షతన నిర్వహించిన బీఎల్‌ఏల అవగాహన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. 2002 ఓటర్ల లిస్టుతో 2026 ఓటరు లిస్టుతో సరి పోల్చడమే ఈ ప్రక్రియ ఉద్దేశమన్నారు. గ్రామగ్రామాన సర్‌పై బీఏల్‌ఏలు ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి డిజిటలైజేషన్ చేయించా లని చెప్పారు. ఈ ప్రక్రియను తేలికగా తీసుకుంటే ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందన్నారు. గత ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో 90 లక్షల ఓట్లు తొలగిపోయాయని వివరించారు. రాష్ట్రంలో కూడా అదే ప్రమాదం పొంచి ఉందన్నారు. అందుకే ప్రతీ ఒక్కరు బాధ్యతయుతంగా ఓటరు లిస్టులో అందరి పేర్లు ఉండేలా మ్యాపింగ్ చేపట్టాలని చెప్పారు. మరో రెండు వారాల గడువు మాత్రమే ఉందన్నారు. ఆలోగా అన్ని పనులను పక్కకు పెట్టి దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇతర ప్రాంతాలలో ఉన్నవారిని గుర్తించి వారికి సమాచారం అందించి ఆన్‌లైన్‌లో ప్రక్రియ పూర్తి చేసే విధంగా చూడాలన్నారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని చెప్పారు. ప్రధానిగా రాహుల్‌గాంధీని చేయడం ఖాయమన్నారు. గడిచిన పది సంవత్సరాల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఎత్తి వేయకుండా వాటిని కొనసాగిస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం చేసిన రూ. 6500 కోట్ల అప్పులకు వడ్డీలు కడుతున్నామన్నారు. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలలోని నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. అందరు కలిసి కట్టుగా పని చేయాలని లేకుంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.. అర్హులైన బీఎల్‌ఏలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కృషి చేస్తామన్నారు. పెద్దపల్లి ఎంపి గడ్డం వంశీ మాట్లాడుతూ బీజేపీ సర్ ముసుగులో పెద్ద కుట్ర పన్నుతుందన్నారు. అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును తీసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఓటు హక్కును కాపాడుకోవాలన్నారు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ సర్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సిర్పూర్ నియోజకవర్గంలో ఈ ప్రక్రియ 56 శాతం పూర్తి చేశామని చెప్పారు. డీసీసీ అధ్యక్షురాలు సుగుణ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల బీఏల్‌ఏలు బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, బీఎల్‌ఏ ఇన్‌చార్జి రాంగోపాల్ వర్మ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ అనిల్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్లు మంగ, విశ్వనాథ్, కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్మన్ షాహిన్ సుల్తానా, డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి చిన్నమల్లన్న, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా, ఏఐసీసీ కార్యదర్శి అతిథి, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.