రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపాలి
ABN , Publish Date - Sep 03 , 2026 | 11:31 PM
గత అ సెంబ్లీ ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యంకాని, అబద్ధపు హా మీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని పలువురు బీ ఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు.
- మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
- పలు మండలాల్లో సబ్‌స్టేషన్ల ఎదుట బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన
నాగర్‌కర్నూల్ టౌన్/ వెల్దండ/ బిజినేపల్లి/ తాడూరు/ తిమ్మా జిపేట (నాగర్‌కర్నూల్), సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : గత అ సెంబ్లీ ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యంకాని, అబద్ధపు హా మీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని పలువురు బీ ఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హా మీలు అమలు చేయాలని కోరుతూ వెల్దండ, బిజినేపల్లి మండ లాల్లో ధర్నాలు చేయగా, 18 గంటల విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ పలు మండలాల్లో గులాబీ శ్రేణులు నిరసన చేపట్టారు.
వెల్దండలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన పోరుబాటలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో పాటు రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. స్థానిక బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని గోలి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పుట్ట రాంరెడ్డి, మాజీ జడ్పీటీసీ విజితారెడ్డి, మాజీ వైస్‌ఎంపీపీ అనిల్‌కుమార్, మాజీ అధ్యక్షుడు కానుగుల జోగయ్య, పీఏసీఎస్ డైరెక్టర్‌లు శేఖర్, నాగులు నాయక్, వెంకటేశ్వరరావు, భీమయ్యగౌడ్, హన్మంతు నాయక్, నిరంజన్, యాదగిరి, అంజిమాస్టర్ ఉన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌస్తాలో గల విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట బీ ఆర్‌ఎస్ నాగర్‌కర్నూల్ మండల అఽధ్యక్షుడు మాధవరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించా రు. నాగర్‌కర్నూల్ మాజీ జడ్పీటీసీ శ్రీశైలం, నాయకులు షఫీఉల్లాఖాన్, అమరేందర్‌రెడ్డి, నాగా ర్జున, వంశీ, లింగారెడ్డి పాల్గొన్నారు.
బిజినేపల్లిలోని ఫూలే, అంబేడ్కర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ ఎంపీపీ శ్రీని వాస్‌గౌడ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అక్కడి నుంచి వెళ్లి విద్యుత్ సబ్ స్టేషన్ ఎదు ట ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మళ్లీ కరెంట్ కోతలతో కర్షకులకు కష్టాలు మొదలయ్యా యని అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల నాయకులు మహేశ్వర్‌రెడ్డి, చీర్ణం బాలస్వామి, చిన్నారెడ్డి, తిరుపతిరెడ్డి, శేఖర్ రావు, మహేష్‌రావు, అల్లోజీ, నరసింహారెడ్డి, వంశీనాయక్, మాలిక్ నాయక్, యాదయ్య, బాలలక్ష్మయ్య, చంద్రారెడ్డి, బాలస్వామి ఉన్నారు.
తాడూరు, మేడిపూర్‌లోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద పార్టీ శ్రేణు లు, రైతులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్‌లు ఎంపీటీసీలు, నా యకులు పాల్గొన్నారు.
తిమ్మాజిపేటలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ముందు గురువారం కాం గ్రెస్ వెయ్యిరోజుల పాలనకు నిరసనగా బీఆర్‌ఎస్ పార్టీ మం డల శాఖ అధ్యక్షుడు జోగు ప్రదీప్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ప థకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించా రు. విద్యుత్ సబ్‌స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి ఏఈ ప్రవీణ్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, సర్పం చ్‌లు హుస్సేనీ, వెంకటయ్య, మాజీ సర్పంచ్‌లు వేణుగోపాల్‌గౌడ్, సత్యం యాదవ్, ఆర్యనాయక్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెం కటేశ్, మాజీ కో ఆప్షన్ అయూబ్‌ఖాన్, నాయకులు స్వామి, వెంకట స్వామి, లక్ష్మయ్య, పాండు, మోహనాచారి, ప్రశాంత్ పాల్గొన్నారు.