Share News

kumaram bheem asifabad-గాంధీజీ ఆశయాలను కొనసాగించాలి

ABN , Publish Date - Oct 02 , 2026 | 11:21 PM

భారత స్వాతంత్య్రం కోసం శాంతి, ఆహింస, సత్యం మార్గాలలో నడుస్తూ గాంధీజీ తన జీవితాన్ని త్యాగం చేశారని ప్రతి ఒక్కరు ఆయన ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

kumaram bheem asifabad-గాంధీజీ ఆశయాలను కొనసాగించాలి
:గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ హరిత, పాల్గొన్న అధికారులు

ఆసిఫాబాద్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): భారత స్వాతంత్య్రం కోసం శాంతి, ఆహింస, సత్యం మార్గాలలో నడుస్తూ గాంధీజీ తన జీవితాన్ని త్యాగం చేశారని ప్రతి ఒక్కరు ఆయన ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు గాంధీజీ చూపిన మార్గంలో పయనించాలని చెప్పారు. సమాజంలోని రుగ్మతల నిర్మూలనలో, దేశ అభివృద్దిలో ప్రతి ఒక్కరు కంకణ బద్దులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌, సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరిష్‌బాబు, గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మంగ, జడ్పీ సీఈఓ లక్ష్మినారయణ, జిల్లా బీసీ అభివృద్ది అధికారి నదీం తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌రూరల్‌, (ఆంధ్రజ్యోతి): గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం అయా పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో డీసీసీ కార్యాలయంలో గాంధీజీ చిత్ర పటానికి డీసీసీ అధ్యక్షురాలు అత్రం సుగుణ, బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీచౌక్‌లోని గాంధీ విగ్రహనికి మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఆకాష్‌, అహ్మద్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబిన్‌ అహ్మద్‌, బీజేపీ ఆధ్వర్యంలో గాంధీచౌక్‌లోని గాంధీ విగ్రహనికి ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు అరిగెల నాగేశ్వర్‌రావులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మంగ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శ్యాంనాయక్‌, విశ్వప్రసాద్‌రావు, బాలేశ్వర్‌డౌడ్‌, నాంపల్లి శంకర్‌, రాపర్తి మురళీ, ఇమ్రాన్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు జీవన్‌, గంధం శ్రీనివాస్‌, బీజేపీ నాయకులు తుకారాం, ప్రసాద్‌గౌడ్‌, సంతోష్‌, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జయంతి వేడుకలను శుక్రవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు నాయకులు గాంధీజీ చిత్రపటానికి ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గుర్నులే మెంగాజీ, బంబార, వాంకిడి, సామెల, సరండి సర్పంచ్‌లు కృష్ణాజీ, సతీష్‌, సంతోష్‌, బాపూజీ, నాయకులు సెల్వట్‌కార్‌ పెంటు, కమలేష్‌ బంటి, జేపీ సుధాకర్‌, విలాస్‌, దాదాజీ, హంసరాజ్‌, మారుతి, శివాజీ, శంకర్‌ పాల్గొన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ వాసవి సేవాదళ్‌ రాష్ట్ర కార్యదర్శి సామల కిరణ్‌కుమార్‌, వాసవి క్లబ్‌ అధ్యకుడు రాచకొండ శ్రీవర్దన్‌, గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్‌, సభ్యులు తంగడిపల్లి మహేష్‌, పెంటన్న, నేరెళ్ల సంతోష్‌, మిర్యాల వెంకటరమణ, కళావతి, అంజమ్మ, పావని, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాద్యక్షుడు కోండ్ర జగ్గాగౌడ్‌ పాల్గొన్నారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి): మండలంలో గాంధీ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు, మాజీ ఎంపీపీ ఆత్రం దౌలత్‌రావు, స్థానిక సర్పంచ్‌ ఆత్రం ఓంప్రకాష్‌ మాజీ సర్పంచ్‌ ఆర్క నాగోరావు, ఆత్రం రాము, కాంగ్రేస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఆత్రం శంకర్‌, కోట్నాక పాండురంగ్‌, నీలకంఠ్‌, ఆత్రం లచ్చు తదితరులు పాల్గొన్నారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): కెరమెరిలో గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సుజాయిత్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గాంఽధీ చిత్రపటానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో ఇందిర ఫెలో షిప్‌ జిల్లా అధ్యక్షురాలు కోవ ఇందిర, మాజీ సర్పంచ్‌ జగన్నాథ్‌రావు, సీనియర్‌ నాయకులు బాపురావు, రాథోడ్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2026 | 11:21 PM