Share News

kumaram bheem asifabad- అత్యంత పేదల జీవితాల్లో మార్పులు తీసుకురావాలి

ABN , Publish Date - Oct 27 , 2026 | 10:18 PM

జిల్లాలో అత్యంత పేదరికంలో ఉన్నవారిని గుర్తించి వారి జీవితంలో మార్పులు తీసుకురావాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభి వృద్ధి శాఖ కమిషనర్‌ దివ్యదేవరాజన్‌ అన్నారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కె హరిత, ఐటీడీఏ పీవో మంద మకరందు, అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌, జిల్లా అటవీ అధికారి బాలామణితో కలిసి మంగళవారం తెలంగాణ సమగ్ర జీవనోపాధుల కార్యక్రమం, వీబీజీరాంజీ పథకంలో చేపట్టవలసిన పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు

kumaram bheem asifabad- అత్యంత పేదల జీవితాల్లో మార్పులు తీసుకురావాలి
:పంచాయతీరాజ్‌ కమినర్‌ దివ్యదేవరాజన్‌కు జ్ఞాపికను అందజేస్తున్న కలెక్టర్‌ హరిత

ఆసిఫాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అత్యంత పేదరికంలో ఉన్నవారిని గుర్తించి వారి జీవితంలో మార్పులు తీసుకురావాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభి వృద్ధి శాఖ కమిషనర్‌ దివ్యదేవరాజన్‌ అన్నారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కె హరిత, ఐటీడీఏ పీవో మంద మకరందు, అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌, జిల్లా అటవీ అధికారి బాలామణితో కలిసి మంగళవారం తెలంగాణ సమగ్ర జీవనోపాధుల కార్యక్రమం, వీబీజీరాంజీ పథకంలో చేపట్టవలసిన పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ జిల్లాలో తెలంగాణ సమగ్ర జీవనోపాధుల కార్యక్రమం కింద మూడు వేల అత్యంత పేద కుటుంబాలను గుర్తించడం జరిగిందని చెప్పారు. వారిలో మార్పులు తీసుకువచ్చే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమం జిల్లాలోని తిర్యాణి, లింగాపూర్‌ మండలాల్లో చేపట్టడం జరిగిందని తెలిపారు. వీబీజీరామ్‌జీ పథకం కింద అర్హులైన కుటుంబాలకు 125 రోజులు పని కల్పించాలని చెప్పారు. జిల్లాలో 1,22,633 జాబ్‌కార్డులు ఉన్నాయని వివరించారు. ఈ పథకం ద్వారా 375 రకాల పనులు చేపట్టవచ్చని తెలిపారు. గ్రామపం చాయతీ భవనాలు, అంగన్‌వాడీ, మహిళ సమాఖ్య భవనాలు, గిడ్డంగుల నిర్మాణాలు చేపట్టవచ్చని తెలిపారు. జలసిరి పథకం ద్వారా పంటకుంటలు, ఊటకుంటలు, నీటి కుంటలు, ఇంకుడు గుంతల నిర్మాణం ద్వారా భూమిలో నీరు ఇంకి భూగర్భ జలం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నందువల్ల వీబీజీరామ్‌జీ పథకం కింద పెద్ద ఎత్తున కూలీలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ హరిత మాట్లాడుతూ జిల్లాలో టీజీఐఎల్‌పీ ప్రాజెక్టు, వీబీజీరామ్‌జీ పథకం పకడ్బందీగా అమలు చేసి పెద్ద ఎత్తున కూలీలకు పనులు కల్పించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం కమిషనర్‌ దివ్యదేవరాజ న్‌ను కలెక్టర్‌ సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో సంబంధిశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): గిన్నెధరి మైఖల్‌ యార్క్‌ స్టడీ సర్కిల్‌ను రాష్ట్ర పంచాయ తీరాజ్‌, గ్రామీణాభి వృద్ధి శాఖ కమిషనర్‌ దివ్యదేవరాజన్‌ సందర్శించారు. ఈ సందర్భం గా స్టడీ సర్కిల్‌లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు పరిశీలించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన అధ్యాయన వాతావరణం కల్పించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. కార్యక్రమంలో ఎడ్యూకేషన్‌ సోసెటీ అధ్యక్షుడు జనార్దన్‌, ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, కోశాదికారి గోపాల్‌, పీడీ షేకు, ఎస్‌సీఆర్‌పి యశ్వంతరావు, గ్రామ స్తులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2026 | 10:18 PM