‘జలియన్‌వాలాబాగ్’ స్ఫూర్తితో ఉద్యమించాలి
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:39 AM
దేశ స్వాతంత్రోద్యమంలో కీలకఘట్టమైన జలియన్‌వాలాబాగ్ అమరులను ప్రజలు స్మరించుకోవాలని అఖిల భారత కిసాన్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వస్కుల మట్టయ్య పిలుపునిచ్చారు.
మిర్యాలగూడ, ఏఫ్రిల్ 13(ఆంధ్రజ్యోతి): దేశ స్వాతంత్రోద్యమంలో కీలకఘట్టమైన జలియన్‌వాలాబాగ్ అమరులను ప్రజలు స్మరించుకోవాలని అఖిల భారత కిసాన్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వస్కుల మట్టయ్య పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎంసీపీఐ(యూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జలియన్‌వాలాబాగ్ అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1919 ఏప్రిల్ 13న రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, స్వాతంత్రోద్యమ నాయకులు సైపుద్దీన్ కిచ్, సత్యపాల్ అరె్‌స్టలకు నిరసనగా పంజాబ్‌లోని జలియన్‌వాలాబాగ్‌లో పెద్దఎత్తున ప్రజలు సమావేశం కాగా నాటి బ్రిటీష్ జనరల్ డయ్యర్ ఆధ్వర్యంలో బిట్రీష్ సైన్యం చుట్టిముట్టి విచక్షణారహితంగా తూటాలు కరిపించి 15మందిని బలి తీసుకున్నారన్నారు. జలియన్‌వాలాబాగ్ ఘటనకు బ్రిటీష్ వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు భగత్‌సింగ్, రాజగురు, సుఖ్‌దేవ్ లాంటి వీర కిషోరాలు పార్లమెంట్‌లో బాంబులు వేసి ఆంగ్లేయ పాలకుల వెన్నులో వణుకు పుట్టించారన్నారు. అణిచివేత, అసమానతలకుకు వ్యతిరేకంగా పీడిత ప్రజలు ఐక్యంగా కదలాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సైదమ్మ, నాయకులు కాశీ, భరత్, కిరణ్, మోహన్‌నాయక్, వీరన్న, రవీందర్, మల్లమ్మ, మాధవి తదితరులు పాల్గొన్నారు.