Share News

కేఎల్‌ఐ చివరి ఆయకట్టుకు సాగునీరందించాం

ABN , Publish Date - Jun 02 , 2026 | 11:05 PM

కేఎల్‌ ఐ చివరి ఆయకట్టు నా గిళ్ల వరకు సాగునీరం దించామని కల్వకుర్తి ఎ మ్మెల్యే కశిరెడ్డి నారా యణరెడ్డి అన్నారు.

కేఎల్‌ఐ చివరి ఆయకట్టుకు సాగునీరందించాం
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

- ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి) : కేఎల్‌ ఐ చివరి ఆయకట్టు నా గిళ్ల వరకు సాగునీరం దించామని కల్వకుర్తి ఎ మ్మెల్యే కశిరెడ్డి నారా యణరెడ్డి అన్నారు. సా గునీరు అందిన తర్వాత కూడా రాలేదని అబద్ధపు ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసమ ని ఆయన ప్రశ్నించారు. కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడారు. ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ డబ్బులను రైతు లకు ఇప్పించడంతో పాటు కాల్వ పూర్తికి కావా ల్సిన నిధులు మంజూరు చేసి పూర్తి చేశారని పేర్కొన్నారు. చివరి ఆయకట్టు నాగిళ్ల వరకు సాగునీరందించినట్లు తెలిపారు. ఇప్పటికైనా బీ జేపీ నాయకులు వాస్తవాలు మాట్లాడాలని ఎ మ్మెల్యే సూచించారు. కేంద్రంలో బీజేపీ అధికా రంలో ఉన్నందున నాయకులు కేంద్ర ప్రత్వ పెద్దలతో మాట్లాడి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చేలా చూడాలని ఎమ్మెల్యే హితవు పలికారు. అనంతరం కల్వకు ర్తి మండలంలోని మార్చాల గ్రామానికి చెందిన అనంతరం మార్చాలకు చెందిన ఖలీల్‌పాషాకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.3.5 లక్షల ఎల్‌వోసీని ఎమ్మెల్యే అందజేశారు. అదేవి ధంగా కల్వకుర్తి పట్టణంలోని వ్యవసాయ మా ర్కెట్‌ ఆవరణలో రూ.2 కోట్లతో జరుగుతున్న అభివృద్ది పనులను కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు సంజీవకుమార్‌ యాదవ్‌తో కలిసి ఎమ్మెల్యే పరి శీలించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ బృంగి రత్నమాల, వైస్‌ చైర్మన్‌ షానవా జ్‌ఖాన్‌, మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌, పలువురు కాంగ్రెస్‌ నాయకులు, పలువురు ప్ర జాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2026 | 11:05 PM