ఇప్పటికే భూములు కోల్పోయాం.. మళ్లీ అన్యాయం చేయొద్దు
ABN , Publish Date - Oct 30 , 2026 | 10:34 PM
గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటికే భూములు కోల్పోయి నిర్వహితుల మయ్యామని, ఇప్పుడు మళ్లీ ఎన్‌హెచ్ 63 వి స్తరణ పేరుతో భూములు కోల్పోవాల్సి వస్తుం దని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్‌హెచ్ 63 బాధితుల రాస్తారోకో
హాజీపూర్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటికే భూములు కోల్పోయి నిర్వహితుల మయ్యామని, ఇప్పుడు మళ్లీ ఎన్‌హెచ్ 63 వి స్తరణ పేరుతో భూములు కోల్పోవాల్సి వస్తుం దని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌హెచ్ 63 విస్తరణలో భాగంగా మూడో అలైన్‌మెంట్ ఖరారు చేస్తూ రైతుల నుంచి ప్రజాభిపాయ సేకరణ నిర్వహించకుండానే రెవెన్యూ అధికా రులు గెజిట్ విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ హాజీపూర్, లక్షెట్టిపేట మండలాలకు చెందిన రైతులు శుక్రవారం జాతీయ రహదారిపై రా స్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అలైన్‌మెంట్ మార్చి రైతులకు అ న్యాయం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామ సభలు నిర్వహించకుండా, రైతుల అభిప్రాయా లను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా అ వార్డులు పాస్ చేయడం సరికాదన్నారు. ప్ర స్తుత అలైన్‌మెంట్‌ను రద్దు చేసి పాత రహ దారినే కొనసాగించాలని, భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ విలువ ప్ర కారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి, రఘునా ధ్‌తో పాటు ఎంపీ ఈ సమస్యపై స్పందించి న్యాయం చేయాలని కోరారు. రైతుల అభిప్రా యాలను పరిగణలోకి తీసుకోకుండా ముందు కు వెళ్తే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. రైతుల రహదారిపై ధర్నా చేయడంతో ఎటు వాహనాలు అటే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ కిరణ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అ నంతరం ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించి వాహనా ల రాకపోకలను పునరుద్దరించారు.