Share News

పట్టణాభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ఉన్నాం

ABN , Publish Date - Jan 13 , 2026 | 10:53 PM

నాగర్‌కర్నూల్‌ ముని సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి సమగ్ర ప్రణాళికతో ఉన్నామని నాగ ర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకు ళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు.

పట్టణాభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ఉన్నాం
ఎండబెట్లలో బాలసదన్‌ భవనానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే

- నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌ ముని సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి సమగ్ర ప్రణాళికతో ఉన్నామని నాగ ర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకు ళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. మంగళవా రం జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పట్టణం లోని 8న వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే పలు ప్రాంతాలను పరిశీలించి స్థానిక ప్రజలు ఎదు ర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. మునిసిపాలిటీ పరిధిలోని 3వ వార్డు దేశిటి క్యాలలో రూ.3.5 కోట్ల వ్యాయంతో నిర్మిస్తున్న హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశా రు. ఎండబెట్లలో రూ.1.5 కోట్లతో నిర్మిస్తున్న బా లసదన్‌ భవన నిర్మాణానికి శంకుస్థాన చేశా రు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి రాజేశ్వరి, మాజీ కౌన్సిలర్లు జక్కా రాజ్‌కుమార్‌ రెడ్డి, తీగల సునేంద్ర, రేణుబాబు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 10:53 PM