సంకల్పంతోనే ఏదైనా సాధించగలం
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:40 PM
సంకల్పంతోనే ఏదైనా సాధించగలమని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్‌గౌడ్ పేర్కొన్నా రు.
-తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది
-బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్‌గౌడ్
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : సంకల్పంతోనే ఏదైనా సాధించగలమని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్‌గౌడ్ పేర్కొన్నా రు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సుచిత్ర ఇన్ ఫంక్షన్‌హాలులో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల ముకేష్‌గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌తో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షి స్తున్నారన్నారు. వారి అభీష్టం మేరకు బీజేపీ తప్పకుండా తెలంగాణలో అధికారంలోకి వస్తుందన్నారు. బీజేపీతోనే బీసీలకు నిజమైన రాజ్యాధి కారం లభిస్తుందని, మోసపూరిత కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మరన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కాళేశ్వరం పేరిట కోట్ల రూపాయల కమీషన్లు దండుకున్నారన్నారు. ప్రధాని మోదీ, అమిత్‌షాల నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యమేలు తుందని, మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు కూడా అవినీతి ఊబి లో ఇరుక్కు పోయారని, రానున్న రోజుల్లో మంచిర్యాలలో కాషాయం జెం డా ఎగరడం ఖాయమన్నారు. అనంతరం శిబిరంలో పలువురికి వైద్య పరీ క్షలు చేసి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అద్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, నాయకులు సత్యనారాయణ, అశో క్ వర్దన్, లచ్చన్న, కృష్ణమూర్తి, శ్రీనివాస్, కార్పొరేటర్ నాగరాజు, సత్యం, కిశోర్ పాల్గొన్నారు.