ప్రజలకు జవాబుదారీగా పని చేస్తున్నాం
ABN , Publish Date - Nov 19 , 2026 | 12:27 AM
ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని, పేదవాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్న ఘనత ప్రజాపా లన ప్రభుత్వానికే దక్కుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. బుధవారం గోదావరిఖని చౌరస్తాలో కొత్తగా 3,057 మందికి పెన్షన్ ప్రొసీడిగ్ ప్రతాలను
కోల్సిటీ, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని, పేదవాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్న ఘనత ప్రజాపా లన ప్రభుత్వానికే దక్కుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. బుధవారం గోదావరిఖని చౌరస్తాలో కొత్తగా 3,057 మందికి పెన్షన్ ప్రొసీడిగ్ ప్రతాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు విజయ వంతంగా అమలుచేస్తూ విమర్శకులకు సమాధానం చెబుతున్నామని, పేదవాళ్ల కోసం ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తూ ఏ ఒక్క పేదవానికి అన్యాయం జరుగకుండా చూస్తున్నామన్నారు. శుక్రవారం నుంచి మరో కొత్త పథకం ఇందిరమ్మ కుటుంబ జీవిత అమలు కాబోతున్నదని తెలిపారు. ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బా బు సహకారంతో వందల కోట్ల నిధులు తీసుకువచ్చి వెనుకబడిన రామ గుండాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రామగుండం మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ రామగుండంలో మొత్తం 52వేల ఇండ్లు ఉంటే కొత్తగా మంజూరు అయిన వారితో కలిసి 22,700పెన్షన్లు ఉన్నాయ న్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, రామగుండం తహసీల్దార్ రవీందర్ ఉన్నారు.
అంతర్గాం మండల కేంద్రంలో..
అంతర్గాం : నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నానని, ప్రజ లకే జవాబుదారీగా పనిచేస్తానని దొంగలకు, ద్రోహులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠా కూర్ అన్నారు. అంతర్గాం మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సభలో మండలంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగులు 349, చేయూత పెన్షన్లు 400, వితంతు 249, వికలాంగుల 70, ఒంటరి మహి ళలకు 30 ప్రొసీడింగు పత్రాలను అందజేసి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభు త్వం 10 ఏళ్లు పాలించి, 8 లక్షల కోట్ల అప్పు చేసి పేదవారికి ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. మండలంలో రూ. 40 కోట్లతో వెయ్యి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు సింఘం కిరణ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అంతర్గాం సర్పంచ్ అంగోతు రవికుమార్ నాయక్. సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ముక్కెర రాజమౌళి, మండల ప్రత్యేక అధికారి ఆకుల సంజీవరావు, తహసీల్దార్ పడాల ప్రసా దరావు, ఎంపీడీఓ గంబీరావుపేట తిరుపతి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పెండ్యాల మహేష్, సర్పంచులు. నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.