Share News

మేమున్నాం.. అధైర్యపడొద్దు

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:13 AM

సాగునీరు అందక పంటలు ఎం డిపోవడంతో ఆందోళన చెందుతున్న అ న్నదాతలకు బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వ ర్కింగ్‌ ప్రెసెడెంట్‌ కల్వకుంట్ల తారక రా మారావు(కేటీఆర్‌)భరోసా కల్పించారు.

 మేమున్నాం.. అధైర్యపడొద్దు
నర్సాపూర్‌లో బాదిత రైతు తిరుపతితో ఫోన్‌లో మాట్లాడుతున్న కేటీఆర్‌

నర్సాపూర్‌ రైతులతో ఫోన్‌లో మాట్లాడి భరోసా ఇచ్చిన కేటీఆర్‌

దండేపల్లి నవంబరు 19 (ఆంధ్ర జ్యోతి): సాగునీరు అందక పంటలు ఎం డిపోవడంతో ఆందోళన చెందుతున్న అ న్నదాతలకు బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వ ర్కింగ్‌ ప్రెసెడెంట్‌ కల్వకుంట్ల తారక రా మారావు(కేటీఆర్‌)భరోసా కల్పించారు. దండేపల్లి మండలం నర్సాపూర్‌ గ్రామా నికి చెందిన బాదిత రైతులతో గురువారం ఫోన్‌లో మాట్లాడిన ఆయన ఎండిపో యి న వరి పంట పరిస్థితిని, రైతులు ఎదు ర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతు తిరుపతి తన ఆవేదనను కేటీఆర్‌కు వివరించారు. ఎండి న వరి పొలాలను బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌కుమార్‌ పార్టీ నాయకులతో కలిసి గురువారం పరిశీ లించారు. పంట ఎండిపోయిందని బాధ తో ఇటీవల బాదిత రైతు పొలానికి నిప్పు అంటించాడు. ఇదే విషయాన్ని కేటీఆర్‌కు ఫోన్‌ చేసి బాధిత రైతులతో మాట్లాడిం చామన్నారు. విజిత్‌రావు మాట్లాడుతూ దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్‌ మండ లాల్లో సాగునీరు నీరు అందక సుమారు 80 శాతం పొలాలు ఎండిపోయాయని అ న్నారు. కడెం ప్రాజెక్టు, గూడెం ఎత్తిపో తల పథకం ద్వారా నీటిని చివరి తడి పొ లాలకు సాగునీరును విడుదల చేసి పం టలను కాపాడే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చుంచు శ్రీని వాస్‌, మాజీ పీఏసీఎస్‌ ఛైర్మన్‌ కాసనగోట్లు లింగన్న, మాజీ వైస్‌ ఛైర్మన్‌ అక్కల రవిందర్‌, మాజీ ఏఎంసి వైస్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్‌, నాయకులు అజేయ్‌, లక్ష్మణ్‌, రాజమల్లు, లింగారెడ్డి, అఖిల్‌, తిరుపతి, నజీర్‌ద్దీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2026 | 12:13 AM