రాంజీ పేరును వ్యతికిస్తున్నాం
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:39 PM
దేశ వ్యాప్తంగా పేదల జీవనోపాధికోసం గతంలో కేంద్రంలోని తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మ హాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును తొలగి స్తూ రాంజీ పేరు పెట్టడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ పా ర్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి
మందమర్రిటౌన్, జనవరి10 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా పేదల జీవనోపాధికోసం గతంలో కేంద్రంలోని తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మ హాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును తొలగి స్తూ రాంజీ పేరు పెట్టడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ పా ర్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మంద మర్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం లోని మోదీ ప్రభుత్వం తమ పార్టీని టార్గెట్ చేయడంతో పాటు నాయ కులపై అక్రమ కేసులు పెట్టడం అలవాటుగా మారిందన్నారు. దేశానికి స్వాతంత్య్రం సాధించడంలో కీలకపాత్ర పోషించిన మహాత్మగాంధీ గ్రామీ ణ ఉపాధిహామీ పథకంతో ఎంతో మంది వంద రోజుల పని దొరుకుతూ ఆకలి తీర్చుకుంటున్నారని, రాంజీపథకం ఎందుకు పెడుతున్నారో జవాబు చెప్పడం లేదన్నారు. ఇప్పటికే తమ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటు చోరికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యం చేస్తున్నాడని దీనిని కూడ ప్రజలు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై తాము కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తామని తెలిపారు. అనంతరం ఈ బీవీ రాంజిచట్టం రద్దు చేయాలని కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.