kumaram bheem asifabad-నీటి వృథాను అరికట్టాలి
ABN , Publish Date - Nov 11 , 2026 | 10:33 PM
ఎల్‌నినో ప్రభావం ఉన్నందున నీటిని వృథాను అరికట్టి ప్రతీ బొట్టును కాపాడుకోవాలని ప్రత్యేక అధికారి, ఏడీఏ మనోహర్ తెలిపారు. కాగజ్‌నగర్ మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన మండల సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నిబో ప్రబావంతో నీటి సమస్య అధికంగా ఉందన్నారు. వరి పంటలను ఎట్టిపరిస్థితుల్లో వేయరాదన్నారు. ఆరుతడి పంటలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
కాగజ్‌నగర్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం ఉన్నందున నీటిని వృథాను అరికట్టి ప్రతీ బొట్టును కాపాడుకోవాలని ప్రత్యేక అధికారి, ఏడీఏ మనోహర్ తెలిపారు. కాగజ్‌నగర్ మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన మండల సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నిబో ప్రబావంతో నీటి సమస్య అధికంగా ఉందన్నారు. వరి పంటలను ఎట్టిపరిస్థితుల్లో వేయరాదన్నారు. ఆరుతడి పంటలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే త్వరలోనే జలసిరి కింద నీటి ఎద్దడి నివారణ గ్రామాల్లో వచ్చే అధికారులకు సర్పంచ్‌లు అంతా సహకరించాలన్నారు. ఎంపీడీవో ఉజ్వల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సమావేశంలో ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు తీసుకొచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేలా ఆయా శాఖల అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని చెప్పారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా చూడాలన్నారు. ఈ సందర్భం గా నీటి సమస్యపై సర్వే చేసేందుకు త్వరలోనే త్రిసభ్య కమిటీ సభ్యులు గ్రామాల్లోకి వస్తారని అధికారులు, నాయకులు సమన్వయంతో నీటి సమస్యలను గుర్తించేలా చూడాలన్నారు. పెండింగ్ సమస్యలపై తక్షణమే పరిష్కరించేట్టు చూడాలన్నారు. ఈ సందర్బంగా భట్టుపల్లి సర్పంచ్ రాజేందర్ మాట్లాడుతూ జీడీ చేనులో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం చేపట్టినప్పటి నుంచి నీరు గ్రామంలోకి రావడం లేదని వెంటనే పరిష్కరించాలని కోరారు. అలాగే అనుకోడ పాఠశాలలో ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో లేరని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని సభా దృష్టికి సర్పంచ్ విలాస్ తీసుకు వాచ్చరు. వెంటనే డీఈవో ఈ సమస్యపై నివేదిక పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎంఈవో వాసాల ప్రభాకర్ తెలిపారు. బోడపల్లిలో విద్యుత్ స్తంబాల వేసినట్టు, ఇంత వరకు కనెక్షన్ ఇవ్వలేదని ఈ విషయంలో అధికారులకు పలుమార్లు ఫోన్ చేసిన కూడా ఎత్తడం లేదని సర్పంచ్ బోడపల్లి రాజన్న సభా దృష్టికి తీసుకొచ్చారు. భట్టుపల్లి సర్పంచ్ రాజేందర్ మాట్లాడుతూ తమ గ్రామంలో విద్యుత్ స్తంభాలు పూర్తిగా వంగి పోయాయని, వెంటనే వీటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో డీఎల్‌పీవో హరి ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ సరిత, వ్యవసాయాధికారి రామకృష్ణ, హార్టికల్చర్ అధికారిని సృజనతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.