Share News

ఎల్లంపల్లిలో తగ్గుతున్న నీరు....

ABN , Publish Date - May 18 , 2026 | 11:16 PM

జిల్లాలో ని గుడిపేట సమీపంలో ఉన్న శ్రీపాద ఎల్లంప ల్లి ప్రాజెక్టులో రోజు రోజుకూ నీటి మట్టం తగ్గిపోతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20. 175 టీఎంసీలు కాగా క్రమేపీ తగ్గుతూ సోమ వారం నాటికి 9.030 టీఎంసీలకు పడిపోయింది.

ఎల్లంపల్లిలో తగ్గుతున్న నీరు....

-ప్రాజెక్టులో వేగంగా ఎండిపోతున్న నిల్వలు

-9 టీఎంసీలకు పడిపోయిన నీటి మట్టం

-గూడెం లిఫ్ట్‌కు, వేమునూరుకు సరఫరా నిలిపివేత

-పొదుపు దిశగా అధికారుల అడుగులు

మంచిర్యాల, మే 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ని గుడిపేట సమీపంలో ఉన్న శ్రీపాద ఎల్లంప ల్లి ప్రాజెక్టులో రోజు రోజుకూ నీటి మట్టం తగ్గిపోతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20. 175 టీఎంసీలు కాగా క్రమేపీ తగ్గుతూ సోమ వారం నాటికి 9.030 టీఎంసీలకు పడిపోయింది. విపరీతమైన ఎండల కారణంగా ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. కొద్ది రోజులుగా ఇలా ప్రతిరోజూ నీటి మట్టం తగ్గుతూనే ఉంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో అతి స్వల్పం గా 144 క్యూసెక్కులు మాత్రమే ఉండగా, ప్రతిరోజు ఔట్‌ ఫ్లో 546 క్యూసెక్కులు ఉండటంతో నీటి మట్టం వేగంగా తగ్గుతోంది. నీటి మట్టం తగ్గుముఖం పడుతుండటంతో గూడెం లిఫ్ట్‌ ఇ రిగేషన్‌కు 290 క్యూసెక్కులతోపాటు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వేమునూరు పంప్‌హౌజ్‌కు ప్రతి రోజు చేసే నీటి సరఫరాను అధి కారులు నిలిపివేశారు. వేమునూరు పంప్‌హౌజ్‌కు ప్రతిరోజు 500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేసే అధికారులు ప్రస్తుతం పూర్తిగా నిలిపివేశారు. వాటితోపాటు ఎన్‌టీపీసీ, నంది పం ప్‌ హౌజ్‌లకు సైతం నీటి విడుదలను నిలిపివే శారు. అలాగే ఎండల తీవ్రత కారణంగా 190 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి హైద్రాబాద్‌లోని మెట్రో వర్క్‌ స్టేషన్‌కు నిత్యం 275 క్యూసెక్కుల నీటిని విడు దల చేస్తుండగా, మిషన్‌ భగీరథ పథకం కో సం పెద్దపల్లి జిల్లా రామగుండంకు 58 క్యూసె క్కులు, మంచిర్యాల జిల్లాకు 23 క్యూసెక్కుల ను విడుదల చేస్తున్నారు.

క్రమంగా తగ్గుతున్న నీటి మట్టం...

ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇటీవల కొద్ది రోజులు గా నీటి మట్టం వేగంగా తగ్గుతోంది. గత నెల 27వ తేదీన 9.308 టీఎంసీలు ఉన్న నీరు ఈ నెల 11న 9.152 టీఎంసీలకు పడిపోయింది. అదేవిధంగా సోమవారం నాటికి 9.030 టీ ఎం సీలకు నీటి మట్టం పడిపోయింది. ప్రాజెక్టులో క్రమేపీ నీటి మట్టం తగ్గుతుండటంతో అధికారులు పొదుపు మార్గాలవైపు దృష్టిసారించే ప నిలో వారు నిమగ్నమయ్యారు. గత ఏడాదితో పోల్చితే ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు సు మారుగా ఒక టీఎంసీ అధికంగా ఉండటం ఆ శాజకంగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్లుకాగా ప్రస్తుతం 143 మీట ర్ల నీరు మాత్రమే ఉంది. గత ఏడాది సరిగ్గా ఇదే సమయానికి 8.014 టీఎంసీల నీరు అం దుబాటులో ఉంది. ప్రాజెక్టులో క్రమేపీ నీటి మట్టం తగ్గుతుండటంతో గూడెం వద్ద గోదావరి బ్రిడ్జి సమీపంలో రాళ్లు బయటపడ్డాయి.

రెండు నెలలు గడ్డుకాలమే....

ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీరు చేరాలంటే మరో రెండు నెలలు వేచి ఉండాల్సిందే. ఎగువన మ హారాష్ట్రలో వర్షాలు కురిసి ప్రాజెక్టులోకి నీరు రావాలంటే జూన్‌ నెల గడిస్తేగానీ సాధ్యం కా దు. అటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న నీ టితోనే అవసరాలన్నీ తీర్చుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌ నగర ప్రజల తా గునీటి అవసరాలు తీర్చేందుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రాజెక్టు నుంచి నేరుగా హై దరాబాద్‌ మెట్రో వాటర్‌ బోర్డుకు ప్రతి రోజు 275 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎల్లంపల్లిలో నీటిమట్టం అతివేగంగా తగ్గుముఖం పడుతుండగా ఇదే పరిస్థితి కొనసాగితే హైదరాబాద్‌ నగరానికి తాగునీటి కష్టాలు తప్పవనే భావనలో అధికారులు ఉన్నారు.

ఇంటేక్‌ వెల్‌ వద్ద అడుగంటిన నిల్వలు....

ప్రాజెక్టు వద్ద ఉన్న మిషన్‌ భగీరథ పథకం ఇంటేక్‌ వెల్‌ వద్ద నీరు ప్రస్తుతం అడుగంటిం ది. ఇంటేక్‌ వెల్‌ చుట్టూ భూమి బయట పడ టమే నీటి మట్టం వేగంగా తగ్గుతుందన డాని కి నిదర్శనం. రానున్న రోజుల్లో ఎండలు తీవ్ర తరం కానుండటంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నా యి. యాసంగి వరి కోతలు పూర్తయినందున గూడెం లిఫ్ట్‌ నుంచి నీటి సరఫరా నిలిపివేయ డంతో కొంతవరకు ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - May 18 , 2026 | 11:16 PM