Share News

kumaram bheem asifabad- పీపీరావు ప్రాజెక్టులో తగ్గుతున్న నీరు

ABN , Publish Date - Mar 29 , 2026 | 10:48 PM

దహెగాం మండలంలోని పాల్వాయి పురుషో త్తమరావు(పీపీరావు) ప్రాజెక్టులో నీరు మండుతున్న ఎండలకు క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీంతో రైతులు పంట చేతికందేనా అని ఆందోళన చెందుతున్నారు. ప్రధాన కాలువ, డి-3 కాలువకు షెట్టర్లు లేక పోవడంతో నీరు వృథాగా పోయి ఎర్రవా గులో కలుస్తోంది. దీంతో సాగు చేసిన వరి పొలాలకు చివరి ఆయకట్టుకు నీరందడం ప్రశ్నార్థకంగా మారింది.

kumaram bheem asifabad- పీపీరావు ప్రాజెక్టులో తగ్గుతున్న నీరు
ఎండిపోతున్న ఎర్రవాగు ప్రాజెక్టు

దహెగాం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): దహెగాం మండలంలోని పాల్వాయి పురుషో త్తమరావు(పీపీరావు) ప్రాజెక్టులో నీరు మండుతున్న ఎండలకు క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీంతో రైతులు పంట చేతికందేనా అని ఆందోళన చెందుతున్నారు. ప్రధాన కాలువ, డి-3 కాలువకు షెట్టర్లు లేక పోవడంతో నీరు వృథాగా పోయి ఎర్రవా గులో కలుస్తోంది. దీంతో సాగు చేసిన వరి పొలాలకు చివరి ఆయకట్టుకు నీరందడం ప్రశ్నార్థకంగా మారింది. దహెగాం మండలం కల్వాడ గ్రామ శివారులో 2000 జూన్‌ 6న అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రారంభించారు. 2003 నవంబరులో పనులు పూర్తి చేసి నవంబరు నెలలో సాగునీటిని విడుదల చేశారు. ఎర్రవాగు, నల్లవాగులపై ప్రాజెక్టు పూర్తి చేశారు. పీపీరావు ప్రాజెక్టు ఎడమ కాలువ కింద దహెగాం మండలం లోని కల్వాడ, కుంచెవెల్లి, పీకలగుండం, చంద్రపల్లి, బామానగర్‌, ఒడ్డుగూడ, లగ్గాం, చౌక, చిన్నరాస్పెల్లి, అమర్‌గొండ, గెర్రె గ్రామాల్లోని 9 వేల ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించాల్సి ఉంది. కానీ ఏ నాడు లక్ష్యాన్ని చేరుకోలేదు. కుడి కాలువ కింద మంచిర్యాల జిల్లాలోని కన్నె పల్లి మండలంలోని మెట్టుపల్లి, చింతపూడి, లింగాల గ్రామాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది.

- ప్రధాన కాలువతో పాటు..

ప్రధాన కాలువలతో పాటు డీ3 కాలువలకు శాశ్వత మరమ్మతులు చేపట్టక పోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి నీరు సరఫరాలో అంతరాయం కలుగుతుంది. ప్రధాన తూములకు డి3 కాలువ తూములకు షెటర్లు లేక పోవడంతో నీరు వృథాగా పోయి ఎర్రవాగులో కలుస్తోంది. కాగా లగ్గాం, చౌక కాలువ తూములు శిథిలావస్థకు చేరుకున్నాయి. చిన్నరాస్పెల్లి, అమర్‌గొండ, పంబాపూర్‌, గెర్రె గ్రామాలకు సాగునీరు పారుతున్న దాఖలాలు కనిపించడం లేదు. దహెగాం మండలంలో పాల్వాయి ప్రాజెక్టు కింద సుమారు నాలుగు వేల ఎకరాల వరి పంటలను సాగు చేశారు. జిల్లాలోనే దహెగాం మండలం యాసంగిలో సుమారు 8,500 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేసినట్లు అధికారులు తెలిపారు. విత్తన వరి, దొడ్డు, సన్నర కాల ధాన్యాన్ని రైతులు సాగు చేశారు. ప్రస్తుతం పంట పొట్టదశలో ఆశాజ నకంగా ఉందని రైతులు చెబుతున్నారు.

రెండు ఎకరాల్లో వరి సాగు..

- దర్గం కేదారి, రైతు, పీకలగుండం

రెండు ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. 90 రోజులలో చేతికి వచ్చే వరి పైరును సాగు చేశారు. గతేడాది యాసంగిలో సాగు నీరు అందక వరి పంట పూర్తిగా ఎండి పోయి నష్టం వచ్చింది. ఈ యాసంగిలోనైనా మంచి దిగుబడి వస్తుందని ఆశలు పెట్టుకున్నాం. ప్రాజెక్టులో నీరు తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

శాశ్వత మరమ్మతులు చేపట్టాలి..

- దుర్గం బాపు, రైతు, చంద్రపల్లి

డి-3 ప్రధాన కాలువలకు అధికారులు శాశ్వత మరమ్మతులు చేపట్టాలి. తూములకు తలుపులు బిగించాలి. శిథిలావస్థకు చేరుకు న్నాయి. కాలువలకు షెటల్లు లేక పోవడంతో నీరు వృధాగా పోయి ఎర్రవాగులో కలుస్తుం ది. మూడు ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. నీరు సక్రమంగా రావడం లేదు.

Updated Date - Mar 29 , 2026 | 10:48 PM