Share News

నీటి సంరక్షణకు జలసిరి

ABN , Publish Date - Nov 27 , 2026 | 10:44 PM

ఎల్‌నినో ప్రభావం కారణంగా రానున్న రోజులలో నీటి కరువు త లెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థి తులు నెలకొనగా భూగర్బ జలాలు సైతం అడుగంటి పోతున్నాయి.

నీటి సంరక్షణకు జలసిరి

ఎల్‌నినో ప్రభావంతో అప్రమత్తం

భూగర్బ జలాలను పెంపొందంచడమే లక్ష్యం

మండలాల వారీగా ప్రత్యేక కార్యాచరణ

ఉపాధి హామీ పనులలో భాగంగా నీటి నిల్వకు చర్యలు

మంచిర్యాల, నవంబర్‌ 27(ఆంధ్రజ్యోతి) : ఎల్‌నినో ప్రభావం కారణంగా రానున్న రోజులలో నీటి కరువు త లెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థి తులు నెలకొనగా భూగర్బ జలాలు సైతం అడుగంటి పోతున్నాయి. దీంతో భవిష్యత్‌లో తీవ్రమైన నీటి కొరత సంభవించే అవకాశాలు ఉండడంతో ప్రభుత్వం ప్రత్యేక పథకాలను చేపడుతోంది. ఇందులో భాగంగా భూగర్భ జలాల పెంపు కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిం చింది. కేంద్ర ప్రభుత్వ పథకమైన వీవీజీ రాంజీ కార్య క్రమంతో అనుసంధానం చేయడం ద్వారా నీటి నిలువ కు ప్రణాళికలను రూపొందించారు. ’’జలసిరి’’ పథకం కింద భూగర్బ జలాల స్థాయిని పెంచేందుకు అసవర మైన పనులు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 16 మండలాలలో నీటి సంరక్షణ చర్యలు చేపడుతుండగా మండలాల వారీగా లక్ష్యాలను ఏర్పాటు చేశారు. ఇందు లో భాగంగా వ్యక్తిగత ఇంకుడుగుంతల నిర్మాణం, సా మూహిక ఇంకుడు గుంతల నిర్మాణంతో పాటు బోర్‌ వెల్‌ రీచార్జి నిర్మాణాలను చేపడుతున్నారు. పనులు ఇ ప్పటికే ప్రారంభం కాగా త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు వెళుతున్నారు. వ్యక్తి గత ఇంకుడుగుంతలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 16 మండలాలలోని మొత్తం 305 గ్రామ పంచాయతీల పరిఽధిలో 7355 నిర్మాణాలను చేపట్టాలనే లక్ష్యంగా పె ట్టుకోగా సామూహిక ఇంకుడు గుంతలను సైతం అదే సంఖ్యలో చేపట్టాలన నిర్ణయించారు. అలాగే బోర్‌వెల్‌ రీచార్జి పనులను ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో 610 నిర్మాణాల లక్ష్యం పెట్టుకొని ఆ దిశగా కార్యాచర ణను అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాలలో వ్యక్తిగత, సామూహిక ఇంకుడు గుంత ల నిర్మాణం, బోర్‌వెల్‌ రీచార్జిల లక్ష్యం ఇలా ఉంది...

మండలం వ్యక్తిగత సామూహిక బోర్‌వెల్‌ రీచార్జి నిర్మాణ లక్ష్యం

ఇంకుడు గుంతల నిర్మాణ లక్ష్యం ఇంకుడు గుంతల నిర్మాణ లక్ష్యం

బెల్లంపల్లి 410 17 34

భీమిని 289 12 24

భీమారం 265 11 22

చెన్నూరు 723 30 60

దండేపల్లి 723 30 60

హాజీపూర్‌ 289 12 24

జైపూర్‌ 482 20 40

జన్నారం 700 29 58

కన్నెపల్లి 362 15 30

కాసిపేట 530 22 44

కోటపల్లి 747 31 62

లక్షెట్టిపేట 434 18 36

మందమర్రి 244 10 20

నెన్నెల 458 19 38

తాండూర్‌ 362 15 30

వేమనపల్లి 337 14 28

పనుల గ్రౌండింగ్‌ ఇలా....

వ్యక్తిగత ఇంకుడు గుంతలకు సంబంధించి మొత్తం 16 మండలాలలో 7355 నిర్మాణాల లక్ష్యం పెట్టుకోగా ఇప్పటి వరకు 1873 నిర్మాణాల పనులు ప్రారంభమ య్యాయి. అలాగే సామూహిక ఇంకుడు గుంతలు జిల్లా వ్యాప్తంగా 305 నిర్మాణాల లక్ష్యం పెట్టుకోగా ఇప్పటి వ రకు 175 చోట్ల పనులు ప్రారంభమయ్యాయి. అలాగే బోర్‌వెల్‌ రీచార్జి స్ట్రక్చర్స్‌కు సంబంధించి 16 మండలా లలో మొత్తం 610 నిర్మాణాలు లక్ష్యంగా పెట్టుకోగా ఇ ప్పటి వరకు 92 నిర్మాణాల పనులు ప్రారంభమయ్యా యి. జిల్లాలో నిర్ణయించిన లక్ష్యం మేరకు వ్యక్తిగత ఇం కుడు గుంతలు మరో 757 మంజూరు కావాల్సి ఉండగా బోర్‌వెల్‌ రీచార్జి నిర్మాణాలు మరో 193 మంంజూరు కావాల్సి ఉంది. సామూహిక ఇంకుడు గుంతలకు సం బంధించి పూర్తి స్థాయిలో లక్ష్యం మేరకు మంజూరు కాగా మరో 406 ఇంకుడు గుంతల పనులు ప్రారం భం కావాల్సి ఉంది.

కందకాలతో భూగర్బ జలాల పెంపు....

కందకాలు, బోర్‌వెల్‌ చుట్టూ ఇంకుడు గుంతలు, వ్య క్తిగత ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్బ జలా ల ను పెంచేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ అ మలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వర్షపు నీటి ప్ర వాహాన్ని నియంత్రించి, భూమిలోకి ఇంకేలా కందకాల తవ్వకం పనులు చేపడుతున్నారు. వీటితో పాటు ఫాం పాండ్స్‌ (నీటి కుంటలు) ద్వారా రైతుల పొలాలలో వ్య వసాయ శాఖ సమన్వయంతో ప్రత్యేక కుంటల నిర్మా ణం చేపట్టి భూగర్బ జలాల పెంపునకు కృషి చేస్తు న్నారు. వర్షభావ సమయంలో పంటలకు అవసర మైన నీటిని అందించడానికి ఇది ఎంతో ఉపయోగపడతా యని అధికారులు చెబుతున్నారు. వ్యక్తిగత ఇంకుడు గుంతలు, బోర్‌వెల్‌ రీచార్జిలకు సంబంధించి ప్రజలపై ఆర్దిక భారం పడకుండా ప్రభుత్వమే గుంతల నిర్మాణం చేపడుతోంది. పంట పొలాలలో నిర్మించే ఫాంపాండ్స్‌ను సైతం ప్రభుత్వమే సొంత ఖర్చులతో నిర్మిస్తుండడం వ ల్ల రైతులపై అధనపు భారం తప్పినట్లయింది. ఒక్కో నీటి కుంట నిర్మాణానికి రూ. 1.35 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ప్రభుత్వం కేటాయిస్తోంది. నీటి సంరక్ష ణకు జలసిరి పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తుం డగా వివిధ గ్రామాలలో ఫీల్డ్‌ అసిస్టెంట్లను సంప్రదించి దరఖాస్తులు సమర్పిస్తే ఇంకుడు గుంతలు, నీటి కుం టలను మంజూరు చేయనున్నట్లు అధికారులు చెబు తున్నారు.

Updated Date - Nov 27 , 2026 | 10:44 PM