కొట్టుకుపోయిన వంతెన
ABN , Publish Date - Jul 25 , 2026 | 10:41 PM
జిల్లా కేం ద్రంలోని రాళ్లవాగుపై ఉన్న కాజువే బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయింది. ఇటీవల కురిసిన సాధారణ వర్షానికే రాళ్లవాగు ప్రవాహం పెరిగి లో లెవల్ వంతెన నామ రూపాల్లేకుండా పోయింది.
-మొదటి వర్షానికే రాకపోకలు బంద్
-నగర వాసులకు రవాణా తిప్పలు
-ప్రతియేటా వర్షాకాలంలో ఇదే తంతు
-ప్రారంభంకాని నూతన వంతెన నిర్మాణం
మంచిర్యాల, జూలై 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేం ద్రంలోని రాళ్లవాగుపై ఉన్న కాజువే బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయింది. ఇటీవల కురిసిన సాధారణ వర్షానికే రాళ్లవాగు ప్రవాహం పెరిగి లో లెవల్ వంతెన నామ రూపాల్లేకుండా పోయింది. దీంతో కాజువేపై రాకపో కలు పూర్తిగా నిలిచిపోయి, నగర వాసులు నానా ఇ బ్బందులు పడుతున్నారు. నగరంలోని లక్ష్మీటాకీస్ ప్రాంతాన్ని, పాత మంచిర్యాల సమీపంలోని రంగం పేటను కలిపేలా 2005లో సుమారు రూ. 80 లక్షల అంచనా వ్యయంతో రాళ్లవాగుపై పైపులతో తాత్కాలిక కాజువే వంతెన నిర్మించారు. బైపాస్ రోడ్డులోని తెలం గాణ అమరుల స్థూపం నుంచి కాజేవే మీదుగా ఆ యా ప్రాంతాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తా రు. అంతకు ముందు వంతెన లేని సమయంలో ఆ ప్రాంత ప్రజలు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లా లంటే పాత మంచిర్యాల మీదుగానో, అండాళమ్మ కాలనీ మీదుగా ఎంసీసీ క్వారీ రోడ్డులోనో ఐదారు కిలో మీటర్లు ప్రయాణించేవారు. దీంతో ప్రజలకు విపరతీం గా దూర భారం పెరగడంతోపాటు అధిక వ్యయ ప్ర యాసలకు గురయ్యేవారు. కాజువే వంతెన నిర్మాణం తరువాత కేవలం అర కిలోమీటర్ ప్రయాణించి నగ రం నడిబొడ్డుకు చేరుకునే వెసులుబాటు కలిగింది. పా లు విక్రయిస్తూ జీవనం సాగించే రంగంపేట ప్రజలు ఈ వంతెన గుండానే ప్రయాణిస్తారు. అలాగే పా ఠశాలలకు వెళ్లే విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆటోలు, ద్విచక్ర వాహనాల ద్వారా వంతెనపై నుంచి రాకపోక లు సాగిస్తుంటారు. రాళ్లపేట, బైపాస్ రోడ్డు ప్రాం తంలోని ప్రజలు ఇప్పటికీ కాజువే వంతెన పై నుంచే పాత మంచిర్యాల మీదుగా ఇతర ప్రాంతాలకు ప్రయా ణాలు సాగిస్తూ ఉంటారు.
ప్రతియేటా ఇదే తంతు...
రాళ్లవాగుపై తాత్కాలికంగా నిర్మించిన కాజువే వం తెన 2019లో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహంలో మునిగి కుప్పకూలిపోయింది. అప్పట్లో కూలిన చోట మట్టితో తాత్కాలిక మరమ్మతులు చేప ట్టారు. అయితే ప్రతియేటా వర్షాకాలంలో కాజువే ము నిగిపోవడం, ఆ తరువాత వంతెన కూలిపోవడం పు నరావృతం అవుతూనే ఉన్నాయి. కూలిన ప్రతీసారీ తా త్కాలిక చర్యలకు పూనుకోవడం తప్పితే శాశ్వత పరి ష్కారం దిశగా ఆలోచనలు చేయలేదు. సంవత్సరాలు గడుస్తున్నా ప్రజా ప్రతినిధులుగానీ, మున్సిపల్ పాలక వర్గం గానీ ఎలాంటి శాశ్వత పరిష్కారం చూపలేదు. దీంతో వర్షాకాలం వచ్చిందంటే చాలు కాజువేపై రాక పోకలు సాగించే వారు భయభ్రాంతులకు గురయ్యే వా రు. కాజువే వంతెన నిర్మాణానికి ముందు అదే ప్రాం తంలో హై లెవల్ బ్రిడ్జి నిర్మించాలనే ప్రతిపాదన ఉం డేది. అయితే 2005కు పూర్వం ఆ ప్రాంతం పెద్దగా అ భివృద్ధి చెందకపోవడంతో అప్పటి పాలకులు కాజువే వంతెనతో సరిపెట్టారు. కాల క్రమంలో రంగంపేట ప్రాంతం అభివృద్ధి చెందడం, సమీపంలో కొత్త కాలనీ లు ఏర్పాటు కావడంతో ప్రజల సౌకర్యార్థం హై లెవల్ బ్రిడ్జి నిర్మించాలనే ప్రతిపాదనలు తెరమీదికి వచ్చాయి. పాలకులు సైతం హై లెవల్ బ్రిడ్జి ఆవశ్యకతపై అనేక సార్లు ప్రస్తావనకు తెచ్చారు. అయితే దశాబ్దాలు గ డిచినా వంతెన నిర్మాణం కేవలం ప్రతిపాదనలకే పరి మితం అయిందిగానీ ఆచరణలోకి రాలేదు.
హైలెవల్ బ్రిడ్జి మంజూరు...
ప్రజల విన్నపాల మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే కొ క్కిరాల ప్రేంసాగర్‌రావు ప్రత్యేక శ్రద్ధతో కాజువే స్థానం లో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలనే నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (టీయూఎఫ్‌ఐడీసీ) నిధులు రూ. 13.50 కోట్లతో హై లెవల్ వంతెన నిర్మా ణానికి కిందటి ఏడాది భూమిపూజ చేశారు. హై లెవ ల్ వంతెన నిర్మాణం పూర్తయితే అవతలివైపు ఉన్న పాత మంచిర్యాల, రంగంపేట, పవర్ హౌజ్ కాలనీ, అండాళమ్మకాలనీ ప్రజలకు రాకపోకలు సులభతరం కానుండగా, ఆయా ప్రాంతాలు వేగంగా అభివృద్ది చెం దే అవకాశాలు అనేకం ఉన్నాయి. తెలంగాణ అమరవీ రుల స్థూపం మొదలుకొని వాగు అవతలివైపు సుమా రు 200 మీటర్ల పొడవుతో వంతెన నిర్మాణం జరుగ నుండగా, మొత్తంగా రూ. 20 కోట్ల వరకు ఖర్చవు తుందని అంచనా వేశారు.
ముందుకు సాగని పనులు...
మంచిర్యాల నగరంలోని బైపాస్ రోడ్డులోగల తెలం గాణ అమర వీరుల స్థూపం వద్ద ఉన్న కాజువే బ్రిడ్జి స్థానంలో నూతన హై లెవల్ వంతెన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు 10 మార్చి 2024న భూమి భూమిపూజ చేశారు. హై లెవల్ వం తెన నిర్మాణానికి కాంట్రాక్టర్ సాయిల్ టెస్ట్ కూడా పూ ర్తి చేశాడు. దాదాపు ఏడాదిన్నర గడుస్తున్నా వంతెన నిర్మాణ పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం ఊసే ఎత్తకపోవడంతో రంగంపేట, ప వర్ హౌజ్ కాలనీ, అండాళమ్మ కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయిల్ టెస్ట్ పూర్తయి నందున వంతెన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ చేపడి తే నిర్మాణ పనులు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉ న్నాయి. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యేతోపాటు సం బంధిత శాఖల ఉన్నతాధికారులు చొరవ చూపాలని ఆయా కాలనీల ప్రజలు కోరుతున్నారు.