kumaram bheem asifabad- మంత్రులకు ఘనస్వాగతం
ABN , Publish Date - May 20 , 2026 | 10:21 PM
కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జూన్ 2న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బుధవారం జిల్లాకు వచ్చిన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులకు జిల్లా కలెక్టర్ కె హరిత, ఎస్పీ నితికా పంత్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఐటీడీఏ పీవో మంద మకరందు, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క, జిల్లా గ్రంధాలయసంస్థ చైర్మన్ అనిల్‌కుమార్, నియోజకవర్గ ఇన్‌చార్జీ శ్యాంనాయక్, డీపీఆర్‌వో సంపత్‌కుమార్‌లు ఘనస్వాగతం పలికారు. కాగా జిల్లాలో జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులు అన్నారు.
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్‌రూరల్ మే 20 (ఆంధ్రజ్యోతి):కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జూన్ 2న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బుధవారం జిల్లాకు వచ్చిన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులకు జిల్లా కలెక్టర్ కె హరిత, ఎస్పీ నితికా పంత్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఐటీడీఏ పీవో మంద మకరందు, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క, జిల్లా గ్రంధాలయసంస్థ చైర్మన్ అనిల్‌కుమార్, నియోజకవర్గ ఇన్‌చార్జీ శ్యాంనాయక్, డీపీఆర్‌వో సంపత్‌కుమార్‌లు ఘనస్వాగతం పలికారు. కాగా జిల్లాలో జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులు అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ముఖ్యమంత్రి పర్యటనపై సమీక్షించారు. పర్యటనకు సంబందించిన ఏర్పాట్లను సభ ప్రాంగణం, భద్రత చర్యలు తదితర ఆంశాలపై సమీక్షించారు. సీఎం పర్యటన విజయవంతం అయ్యేల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేయాలని పెర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్‌పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని ప్రింట్ అండ్ ఎలక్ర్టానిక్ మీడియా జర్నలిస్టులకు బుధవారం 2026-28 అక్రిడిటేషన్ కార్డులను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుల చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండె విఠల్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, కలెక్టర్ హరిత, డీపీఆర్‌వో సంపత్‌కుమార్, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.