kumaram bheem asifabad- మున్సిపాలిటీల్లో వార్డు రిజర్వేషన్లు ఖరారు
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:16 PM
జిల్లాలో ని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లోని వార్డులకు రిజర్వేషన్ ఖరారయ్యాయి, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలోని సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్ వెంకటేష్ దోత్రే మున్సిపల్ అధికారులతో కలసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల పరిధిలోని 50 వార్డు కౌన్సిలర్ స్థానాలకు సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు.
- డ్రా పద్ధతిన కేటాయించిన అధికారులు
- పట్టు నిలుపుకునేందుకు రాజకీయ పార్టీల వ్యూహాలు
ఆసిఫాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లోని వార్డులకు రిజర్వేషన్ ఖరారయ్యాయి, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలోని సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్ వెంకటేష్ దోత్రే మున్సిపల్ అధికారులతో కలసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల పరిధిలోని 50 వార్డు కౌన్సిలర్ స్థానాలకు సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. మున్సిపాలి టీ చైర్ పర్సన్ రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియ రాష్ట్ర యానిట్‌గా కేటాయించగా ఆసిఫాబాద్ మున్సిపాలిటి చైర్‌పర్సన్ పదవి కోసం బీసి జనరల్ , కాగజ్‌నగర్ మున్సిపాలిటి చైర్‌పర్సన్ పదవి కోసం బీసి మహిశకు రిజర్వేషన్ కేటాయించారు.
- రెండు మున్సిపాలిటీల పరిధిలో..
జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ రెండు మున్సి పాలిటీలు ఉన్నాయి. ఆసిఫాబాద్ మున్సిపాలిటిలో 20 వార్డులు ఉండగా అందులో ఎస్టీ జనరల్ 1, ఎస్టీ మహిళ 1, ఎస్సీ జనరల్ 2,ఎస్సీ మహిళ 1 ,బీసి జనరల్ 3 , బీసి మహిళ 2, జనరల్ 4 ,జనరల్ మహిళ 6 స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించారు.20 వార్డుల్లో మొత్తం 13,927 మంది ఓటర్లు ఉండగా ఇందులో 6,822 మంది పురుషులు,7,103 మంది మహిళలు,ఇతరులు ఇద్దరు ఉన్నారు, కాగజ్‌నగర్ మున్సిపాలిటి లో 30 వార్డులు ఉండగా ఇందులో ఎస్టీ జనరల్ 1, ఎస్సీ జనరల్ 3, ఎస్సీ మహిళ 2 ,బీసి జనరల్ 5 , బీసి మహిళ 4, జనరల్ 6 , జనరల్ మహిళ 9 స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించారు. 30 వార్డుల్లో మొత్తం 51,205 మంది ఓటర్లు ఉండగా ఇందులో 25,004 మంది పురుషులు,26,193 మంది మహిళ లు, ఇతరులు ఎనిమిది మంది ఓటర్లు ఉన్నారు.
- చైర్‌పర్సన్ పదవులు బీసీలకే..
జిల్లాలోని రెండు మున్సిపాలిటీలలో చైర్ పర్సన్ పదవులు బీసీ సామాజిక వర్గానికే దక్కా యి. ఈమేరకు రిజర్వేషన్‌లు ఖరారు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ బీసి జనరల్‌కు కేటాయించారు. కాగజ్‌న గర్ మున్సిపల్ చైర్‌పర్సన్ బీసి మహిళకు కేటా యించారు. దీంతో జిల్లాలోని రెండు మున్సిపాలి టీల్లో చైర్‌పర్సన్ పదవులు బీసీలనే వరించనున్నా యి.
- రాజకీయ పార్టీల సమాయత్తం..
మున్సిపల్ ఎన్నికలకు వివిధ రాజకీయ పార్టీలు సైతం సమాయత్తమవుతున్నాయి. అధికార కాంగ్రె స్‌తోపాటు బీఆర్‌ఎస్, బీజేపీ, తదితర పార్టీలు సైతం ఈ విషయమై కసరత్తు మొదలు పెట్టాయి. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఎన్నికలపై పూర్తిస్థాయిలో ధృష్టి సారించేందుకు ఆయా పార్టీల నేతలు సిద్ధవుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలను గెలుచుకోవడం ద్వారా జిల్లాలో పట్టు నిలుపుకోవాలని యత్నిస్తోంది. పట్టుకోసం బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు సైతం యత్నిస్తున్నారు. కాంగ్రెస్ విషయానికి వస్తే జిల్లాలోని రెండు నియోజకవర్గాలు అయిన ఆసిఫాబాద్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిర్పూర్(టి)లో బీజేపీ ఎమ్మెల్యే హరీష్‌బాబు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలను ప్రజలు వ్యక్తిగతంగా పరిగణించే అవకాశం ఉన్నందున అభ్యర్థుల ఎంపికలో ఆయా పార్టీల నేతలు ఆచితూచి నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రిజర్వేషన్లు ఇలా..
-----------------------------------------------------------------
వార్డుల సంఖ్య కేటాయించిన రిజర్వేషన్
------------------------------------------------------------------
వార్డు-1 ఎస్సీ- జనరల్
వార్డు-2 బీసి- జనరల్
వార్డు-3 బీసి- జనరల్
వార్డు-4 ఎస్టీ - జనరల్
వార్డు-5 బీసి- మహిళ
వార్డు-6 జనరల్
వార్డు-7 జనరల్- మహిళ
వార్డు-8 బీసి- మహిళ
వార్డు-9 జనరల్
వార్డు-10 ఎస్సీ- జనరల్
వార్డు-11 బీసి - జనరల్
వార్డు-12 ఎస్టీ- మహిళ
వార్డు-13 జనరల్- మహిళ
వార్డు-14 జనరల్- మహిళ
వార్డు-15 జనరల్
వార్డు-16 ఎస్సీ- మహిళ
వార్డు-17 జనరల్
వార్డు-18 జనరల్- మహిళ
వార్డు-19 జనరల్- మహిళ
వార్డు-20 జనరల్- మహిళ
-----------------------------------------------------------------------
కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో..
-----------------------------------------------------------------
వార్డు సంఖ్య కేటాయించిన రిజర్వేషన్
------------------------------------------------------------------
వార్డు-1 బీసి-మహిళ
వార్డు-2 ఎస్సీ-జనరల్
వార్డు-3 బీసి-మహిళ
వార్డు-4 బీసి-మహిళ
వార్డు-5 జనరల్
వార్డు-6 జనరల్-మహిళ
వార్డు-7 జనరల్-మహిళ
వార్డు-8 జనరల్
వార్డు-9 జనరల్-మహిళ
వార్డు-10 జనరల్
వార్డు-11 జనరల్
వార్డు-12 ఎస్సీ- మహిళ
వార్డు-13 బీసి-మహిళ
వార్డు-14 జనరల్-మహిళ
వార్డు-15 బీసి- జనరల్
వార్డు-16 బీసి- జనరల్
వార్డు-17 బీసి- జనరల్
వార్డు-18 జనరల్-మహిళ
వార్డు-19 ఎస్సీ- మహిళ
వార్డు-20 జనరల్-మహిళ
వార్డు-21 జనరల్-మహిళ
వార్డు-22 బీసి- జనరల్
వార్డు-23 జనరల్-మహిళ
వార్డు-24 జనరల్
వార్డు-25 ఎస్సీ-జనరల్
వార్డు-26 జనరల్
వార్డు-27 జనరల్-మహిళ
వార్డు-28 ఎస్సీ-జనరల్
వార్డు-29 బీసి- జనరల్
వార్డు-30 ఎస్టీ-జనరల్