Share News

kumaram bheem asifabad-వార్డుసభలు నిర్వహించాలి

ABN , Publish Date - Jun 02 , 2026 | 10:50 PM

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో గ్రామ పంచాయతీల్లో, మున్సి పాలటీల పరిధిలో వార్డుసభలు నిర్వహించి సంబంధిత మండల స్థాయి అధికారులందరు పాల్గొనాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం వీసీ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు

kumaram bheem asifabad-వార్డుసభలు నిర్వహించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ కె హరిత, పాల్గొన్న అధికారులు

ఆసిపాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో గ్రామ పంచాయతీల్లో, మున్సి పాలటీల పరిధిలో వార్డుసభలు నిర్వహించి సంబంధిత మండల స్థాయి అధికారులందరు పాల్గొనాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం వీసీ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీ వార్డులలో సభలు నిర్వహించి సంబంధిత శాఖల అధికారులు హాజరు కావాలని తెలిపారు. ఆయా సభలలో కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమం ఉద్దేశం వివరించాలని, పర్యావరణం, అటవీ శాఖలపై చర్చించాలని, యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు, పోలీసు, రెవెన్యూ అధికారుల సమన్వయంతో పని చేసి వేగవంతం చేయాలని తెలిపారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలు, ఎరువులు అందించేందుకు ప్రణాళిక రూపొం దించాలని తెలిపారు. సభలలో మహిళా రక్షణ, మాదక ద్రవ్యాల నివారణ, రహదారి భద్రతపై ప్రజలకు వివరించాలని తెలిపారు. వచ్చే వర్షాకాలంలో గ్రామాల్లో పారిశుధ్య, మరుగు కాలువల శుభ్రత, ప్లాస్టిక్‌ వ్యస్థాల తరలింపు చేపట్టాలని, భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల జలమయమై ఇండ్లలోనికి నీరు చేరినట్లయితే నిరాశ్రయులకు వెంటనే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తరలించాలని సూచిం చారు. రాష్ట్ర, కేంద్ర ప్రకృతి విసత్తుల ప్రతి స్పందన బృందాలను, రెస్క్యూ బృందాలను సిద్ధం చేసుకోవాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా లక్ష్యాలను అనుగుణంగా మొక్కలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలోని వీసీ హాల్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ కె హరిత, ఎస్పీ నితికాపంత్‌, అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లాలతో కలిసి హాజరయ్యారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ 335 గ్రామ పంచాయతీలు, 2 మున్సిపాలిటీల్లో నాలుగు రోజుల పాటు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వార్డుసభల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వానాకాలం సీజన్‌కు రైతులకు సరిపడ విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా వ్యవసాయ శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో ప్రతి రోజు పారిశుధ్య పనులు చేపట్టాలని, వర్షాలు కురిసే సమయంలో నీరు నిలవ ఉండే ప్రాంతాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

Updated Date - Jun 02 , 2026 | 10:50 PM