Share News

రూ.5,257 కోట్లతో వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీ పనులు

ABN , Publish Date - Mar 08 , 2026 | 04:09 AM

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) పనుల కోసం 5,257.20 కోట్లకు సర్కారు పరిపాలనా అనుమతులు ఇచ్చింది.

రూ.5,257 కోట్లతో వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీ పనులు

  • పెరిగిన అంచనా వ్యయం

  • పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు

  • అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ పథకం కింద నిధుల సమీకరణ

ఇంటర్నెట్ డెస్క్: గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) పనుల కోసం 5,257.20 కోట్లకు సర్కారు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఈమేరకు శనివారం పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2024లో ఈ పథకానికి 4,170 కోట్లతో సూత్రప్రాయంగా అనుమతిచ్చినా తుది అంచనాలు పూర్తయ్యేసరికి మరింత పెరిగిందని పేర్కొంది. అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ పథకం కింద ప్రాజెక్ట్‌ అమలుకు అవసరమైన నిధులు సమీకరించేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

అదనపు సబ్‌ రిజిస్ట్రార్ల నియామకం

పని భారం అధికంగా ఉన్న నాలుగు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు సీనియర్‌ అసిస్టెంట్లను డిప్యుటేషన్‌లో సబ్‌ రిజిస్ట్రార్లుగా సర్కారు నియమించింది. సునీల్‌ కుమార్‌ను నారపల్లికి , ఒ.బాలకృష్ణను కీసరకు, పి.వికాస్‌ రెడ్డిని రాజేంద్రనగర్‌కు, ఎన్‌.అరవింద్‌ కుమార్‌ను పటాన్‌ చెరువు సబ్‌ రిజిస్ట్రార్‌గా నియమించింది.

Updated Date - Mar 08 , 2026 | 04:11 AM