రేవంత్‌ను కలిసిన ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేలు
ABN , Publish Date - Mar 09 , 2026 | 03:47 AM
వరంగల్ కార్పొరేషన్‌లో భూగర్భ డ్రైనేజీ పనుల కోసం రూ.5,257 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లా...
హైదరాబాద్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): వరంగల్ కార్పొరేషన్‌లో భూగర్భ డ్రైనేజీ పనుల కోసం రూ.5,257 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎంపీ కావ్య ధన్యవాదాలు తెలిపారు. పునరుద్ధరించిన శాసనమండలి హాల్‌ను ప్రారంభించేందుకు ఆదివారం అసెంబ్లీకి వచ్చిన సీఎంను వారు కలిశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నేతలు మాట్లాడారు. గత ప్రభుత్వం తమ జిల్లాను ఆరు ముక్కలు చేస్తే ఈ ప్రభుత్వం వరంగల్‌కు ఎయిర్‌పోర్టును తెచ్చిందని రాజేందర్‌రెడ్డి అన్నారు. రూ.547కోట్లతో తాగు నీటి సమస్యనూ తీర్చుతున్నట్లు చెప్పారు.