kumaram bheem asifabad- చలికాలంలో నడక
ABN , Publish Date - Jan 06 , 2026 | 10:20 PM
చలికాలం నడకతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. జిల్లాలో చలిపంజా విసురుతోంది. ఉదయం 8గంటల వరకు కూడా పొగమంచు పోవడం లేదు. అయినప్పటికీ ఉదయం ఆరు గంటల వరకు అన్ని క్రీడా మైదానాలు వాకర్స్‌తో నిండిపోతున్నాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రజలు ఉదయం వేళలో మైదానాలలో కనబడుతున్నారు. నగరంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సైతం వాకింగ్ చేస్తూ ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు.
- ఆసక్తి చూపుతున్న ప్రజలు
బెజ్జూరు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): చలికాలం నడకతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. జిల్లాలో చలిపంజా విసురుతోంది. ఉదయం 8గంటల వరకు కూడా పొగమంచు పోవడం లేదు. అయినప్పటికీ ఉదయం ఆరు గంటల వరకు అన్ని క్రీడా మైదానాలు వాకర్స్‌తో నిండిపోతున్నాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రజలు ఉదయం వేళలో మైదానాలలో కనబడుతున్నారు. నగరంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సైతం వాకింగ్ చేస్తూ ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. సాధారణంగా శీతాకాలంలో బరువు పెరుగుతారని, అందువల్ల వాకింగ్ చేయాలని వైద్యులు చెబుతున్నారు. దీంతో అధికశాతం ప్రజలు, యువత నడకపై ఆసక్తి కనబరుస్తున్నారు. వాకింగ్ చేయడం వల్ల శరీరంలో అనేక మార్పులు జరిగి ఆరోగ్యంగా ఉండటం, ఖర్చు లేని పని కావడం, రక్త ప్రసరణ సజావుగా సాగడంతో ఉదయమే విధిగా గ్రౌండ్స్‌కు వెళ్తున్నారు. ప్రస్తుత కాలంలో 80శాతం ప్రజలు, యువత ఇతర వ్యాయామాల కంటే వాకింగ్‌నే అనుసరిస్తున్నారు.
- గ్రామీణ ప్రాంతాల్లోనూ..
గ్రామీణ ప్రాంతాల్లో సైతం యువతీ, యువకులు, పెద్దలు కూడా వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడు కుంటున్నారు. ప్రస్తుత కాలంలో ఆహార అలవాట్ల కారణంగా అన్ని వయసుల వారు అనేక అనారోగ్య సమస్యలతో బాదపడుతున్నారు. ఇందుకు కారణం సరైన పోషకాహారం లేకపోవడంతో పాటు వ్యాయా మానికి దూరంగా ఉండటమే కారణమని వైద్య నిపు ణులు చెబుతున్నారు. ప్రతి మనిషి రోజూ గంట పాటు నడిచినట్లయితే ఎలాంటి వ్యాదులు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతుండడంతో ఎక్కువగా నడకపై దృష్టి సారిస్తున్నారు. ఉదయం వేళ ఎక్కడ చూసినా యువకులు, ఇతరులు రోడ్ల వెంట నడుస్తూ కనబడుతున్నారు. పట్టణాల్లో మాత్రం అనేక చోట్ల మైదానాలు వాకింగ్ జోన్‌లుగా ఏర్పడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వసతులు లేక పాఠశాల ప్రాంగణాల్లోనే నడకను కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల వాకింగ్ వాకింగ్ ట్రాక్‌లు లేకపోవడంతో మైదానా ల్లోనే చలిని సైతం లెక్క చేయకుండా నడుస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ కనబరుస్తున్నారు. వాకింగ్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళలో పల్లె, పట్టణాలు అనే తేడా లేకుండా వాకింగ్ చేస్తున్నారు.
ప్రయోజనాలు ఇలా..
- వాకింగ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది.
- బీపీ షుగర్‌లెవెల్స్‌అదుపులో ఉంచుతుంది.
- టీబీ వ్యాధి అదుపులో ఉంచుతుంది.
- రక్త ప్రసరణ పెరిగి, మెదడు, నరాలు, కండరాలు చురుగ్గా పని చేస్తాయి.
- ఎముకలకు, కీళ్లకు మరింత ఆరోగ్యంగా మారుతాయి.
- శరీరానికి నూతన శక్తి లభిస్తుంది.
- రాత్రివేళ త్వరగా నిద్ర రావడానికి ఉపకరిస్తుంది.
- వేకువ జామున వాకింగ్ చేయడం వల్ల శరీరానికి ఆక్సిజన్ లభిస్తుంది.
- కాళ్లు, చేతులు, మెదడు బ్యాలెన్సింగ్ కో ఆర్డినేషన్‌గా పని చేస్తాయి.
- సమయాన్ని అనుసరిస్తూ స్పీడ్‌గా వాకింగ్ చేయడం మంచిది.
- మోకాళ్లు వంగకుండా డిస్క్ వాక్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది.
- వాకింగ్ చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడ కూడదు.
- సరైన షూ ఉపయోగించాలి.