kumaram bheem asifabad- నిధుల కోసం నిరీక్షణ
ABN , Publish Date - May 06 , 2026 | 11:41 PM
ఆసిఫాబాద్-సిర్పూరు నియోజకవర్గాల కోసం ఉపయోగపడేలా రెండు గుట్ట మధ్య నిర్మించిన కొమురం భీం ప్రాజెక్టుకు సంబంఽధించిన ఎడమ కాల్వ ప్రాజెక్టు ఇంకా పూర్తి కావటం లేదు. 2005లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయింది. ఎడమ కాల్వ ద్వారా సిర్పూరు నియోజకవర్గానికి నీరు అందించాలన్న లక్ష్యంతో 2011లో పనులు ప్రారంభించినా ఇప్పటికీ పూర్తి స్థాయిలో కాల్వ నిర్మాణం పూర్తి కాలేదు. నిధుల లేమి, భూ పరిహారం చెల్లింపు పూర్తి కాలేదు. దీంతో కొమురం భీం ప్రాజెక్టు నిర్మించిన ఈ ప్రాంతానికి ఉపయోగ పడని పరిస్థితి నెలకొంది. సిర్పూరు నియోజవకర్గంలోని వివిధ ప్రాంతాల వా
కాగజ్‌నగర్, మే 6 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్-సిర్పూరు నియోజకవర్గాల కోసం ఉపయోగపడేలా రెండు గుట్ట మధ్య నిర్మించిన కొమురం భీం ప్రాజెక్టుకు సంబంఽధించిన ఎడమ కాల్వ ప్రాజెక్టు ఇంకా పూర్తి కావటం లేదు. 2005లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయింది. ఎడమ కాల్వ ద్వారా సిర్పూరు నియోజకవర్గానికి నీరు అందించాలన్న లక్ష్యంతో 2011లో పనులు ప్రారంభించినా ఇప్పటికీ పూర్తి స్థాయిలో కాల్వ నిర్మాణం పూర్తి కాలేదు. నిధుల లేమి, భూ పరిహారం చెల్లింపు పూర్తి కాలేదు. దీంతో కొమురం భీం ప్రాజెక్టు నిర్మించిన ఈ ప్రాంతానికి ఉపయోగ పడని పరిస్థితి నెలకొంది. సిర్పూరు నియోజవకర్గంలోని వివిధ ప్రాంతాల వాసులకు ఎంతగానో ఉపయోగడే కొమురం భీం ఎడమ కాల్వ పనులు త్వరగా పూర్తిచేస్తే ఈ ప్రాంత రైతులు మూడు పంటలు తీసేందుకు చక్కటి అవకాశాలున్నాయి. అయితే ప్రభుత్వాలు మారుతున్నా ఈ ప్రాజెక్టుపై ఇంకా పూర్తిస్థాయి ముందు చూపు రావటం లేదు. కేవలం నిధుల కేటాయింపులో తక్కువగా కేటాయించటమే అసలు సమస్య ఏర్పడింది.
ఫ ఇంకా 100 ఎకరాల భూమి..
ఈ కాల్వల నిర్మాణం పూర్తి కావాలంటే ఇంకా రూ.80 కోట్ల నిధులు అవసరం ఉంది. అలాగే 100 ఎకరాల భూ సమస్య కూడా క్లియరెన్స్ కావాల్సి ఉంది. ఈ రెండు ప్రక్రియలతో జాప్యం కావటంతో ఇప్పటికీ ఈ కాల్వల నిర్మాణం ప్రారంభించి పదిహేన్లు గడిచినా ఇంత వరకు కొలిక్కి రాకపోవటం విశేషం. ఈ కాల్వ పనులు పూర్తి స్థాయిలో చేపడితే ఈ ప్రాంత రైతులు మూడు పూటల పంటలు పండించేందుకు చక్కటి అవకాశాలున్నాయి. కేవలం నిధుల కేటాయింపు పూర్తిస్థాయిలో కాక పోవటంతోనే పనుల్లో జాప్యం జరుగుతోంది. ఈ కాల్వలను బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ స్వయంగా రెండేళ్ల క్రితం పరిశీలించి నిధులు విడుదల చేయాలని సీఎం దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లారు. అలాగే సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కూడా ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. కొమురం భీం ప్రాజెక్టులో వర్షా కాలంలో పుష్కలంగా నీరు నిల్వ చేసుకునేందుకు అవకాశాలున్నప్పటికీ ఎడమ కాల్వ పూర్తి కాక పోవటంతో ఈ ప్రాంత రైతులు వర్షాధారంపైనే ఆధార పడాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు, నాయకులు వెంటనే స్పందించి కొమురం భీం ఎడమ కాల్వ పరిస్థితి సమస్యను పరిష్కరించి వెంటనేపనులు ప్రారంభించేలా చూడాలని రైతులు కోరుతున్నారు.