Share News

వార్పిన్‌ కార్మికులకు కూలి పెంచాలి

ABN , Publish Date - May 05 , 2026 | 12:52 AM

పాలిస్టర్‌ వార్పిన్‌ కార్మికులకు యజమానులు కూలి పెంచే విధంగా జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకుని సమ్మెను విరమింపజేయాలని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌ కోరారు. సిరిసిల్ల పట్టణంలో

వార్పిన్‌ కార్మికులకు కూలి పెంచాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న వార్పిన్‌ కార్మికులు

సిరిసిల్ల అర్బన్‌, మే 4 (ఆంఽధ్రజ్యోతి): పాలిస్టర్‌ వార్పిన్‌ కార్మికులకు యజమానులు కూలి పెంచే విధంగా జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకుని సమ్మెను విరమింపజేయాలని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌ కోరారు. సిరిసిల్ల పట్టణంలో పాలిస్టర్‌ వస్త్ర పరిశ్రమలల్లో పనిచేసే కార్మికులకు కూలి పెంచాలంటూ వారం రోజులుగా సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వార్పిన్‌ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం కార్మికులు రగుడు జంక్షన్‌ నుంచి జిల్లా కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వరకు ర్యాలీగా తరలివచ్చి న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భం గా రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌ మాట్లాడుతూ పాలిస్టర్‌ వస్త్ర పరిశ్రమలల్లో పనిచేస్తున్న వార్పిన్‌ కార్మికుల కూలి ఒప్పందం గడువు ముగిసి రెండు సంవత్సరాలు గడుస్తున్నా యజమానులు కూలి పెంచాలని వినతి పత్రాలను అందించినా యజమానులు పట్టించుకోకపోవడంతో గత నెల 27 నుంచి కార్మికులు నివరధిక సమ్మె చేస్తున్నారన్నారు. అధికారులు యాజమానులతో కూలి విషయమై చర్చలు జరిపినా యజమానులు ఒప్పకోకపోవడం శోచనీయమన్నారు. గత నాలుగు సంవత్సరాల క్రితం ఒప్పకున్న కూలీనే ప్రస్తుతం కొనసాగిస్తున్నారని తెలిపారు. పెరిగిన నిత్యవసర సరుకులథరలకు అనుగుణంగా కూలీ పెంచకోవడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని అవేదన వ్యక్తం చేఽశారు. జిల్లా కలెక్టర్‌ స్పందించి యాజమానులతో చర్చలు జరిపి కూలీలకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టి సమ్మెను విరమింపజేయాలంటూ జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ను కలిసి సమస్యలను విన్నవించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, వార్పిన్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు సిరిమల్లె సత్యం, ఉడుత రవి, బూట్ల వెంకటేశ్వర్లు, అన్నల్‌దాస్‌ గణేష్‌, ఐరెన్‌ప్రవీణ్‌, అవదూ హరిదాస్‌, అడిచెర్ల రాజు, మచ్చవేణు, తులసీదాస్‌, దోమలరమేష్‌, జిందం శ్రీకాంత్‌, సుంక భాస్కర్‌, చింతకింది సుదన్‌, వేముల నర్సయ్య, గాజుల రాజు, మేర్గు మహేష్‌, కూరపాటి భాస్కర్‌, ఽశ్యామ్‌, వంగ సుదర్శన్‌, ఉడుత శ్రీధర్‌, అడెపు నరేష్‌, దూడం ప్రసాద్‌,బాలకిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2026 | 12:52 AM