kumaram bheem asifabad- వేతన కష్టాలు
ABN , Publish Date - Jan 14 , 2026 | 10:25 PM
పది నెలలుగా అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు జీతాలు అందకపోవడంతో కష్టాలు పడుతున్నారు. వారంత పొరుగు సేవల పంచాయతీ కార్యదర్శులు. రెగ్యులర్ కార్యదర్శులతో సమానంగా అవుట్ సోర్సింగ్‌గా విధులు నిర్వర్తిస్తూ గ్రామాల్లో ప్రజలు, అఽధికారులకు జవాబుదారిగా ఉంటున్నారు.
- ప్రభుత్వం నెలనెలా చెల్లించాలని వినతి
జైనూర్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): పది నెలలుగా అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు జీతాలు అందకపోవడంతో కష్టాలు పడుతున్నారు. వారంత పొరుగు సేవల పంచాయతీ కార్యదర్శులు. రెగ్యులర్ కార్యదర్శులతో సమానంగా అవుట్ సోర్సింగ్‌గా విధులు నిర్వర్తిస్తూ గ్రామాల్లో ప్రజలు, అఽధికారులకు జవాబుదారిగా ఉంటున్నారు. కానీ వారికి ఉద్యోగ భద్రత అటుంచితే కనీస వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పది నెలలుగా జీతాలు అందడం లేదు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఆయా గ్రామాల్లో సిబ్బందికి భోజన వసతి, షామియానా, తదితర పనులకు అప్పులు చేసి ఏర్పాట్లు పూర్తి చేసినా ప్రభుత్వం నుంచి నయా పైసా రాక పోవడంతో సతమతమవుతున్నారు. జిల్లా లో 335 గ్రామ పంచాయతీలు ఉండగా 53 మంది ఓపీఎస్ పద్ధతిలో కార్యదర్శులుగా విధులు నిర్వర్తిస్తు న్నారు. 2021 జూన్ 11న ప్రభుత్వ జీవో నంబరు 60 ప్రకారం అన్ని శాఖల్లోని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం వేతనం పెరిగింది. ఈ మేరకు వీరికి రూ.18,500 ఇవ్వాల్సి ఉండగా అమలు కావడం లేదు. తమ సర్వీస్ రెగ్యూలరైజ్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఆందోళనలు చేపట్టినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు పెంచక పోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారు.
పది నెలలుగా..
ఆయా మండలాల్లో పని చేస్తున్న ఓపీఎస్ కార్యద ర్శులకు పది నెలలుగా వేతనాలు అందడం లేదు. గతేడాదిఏప్రీల్ నుంచి ఇప్పటి వరకు జీతం చెల్లించ లేదు. అసలే తక్కువ జీతంతో పని చేస్తుండగా అది నెల నెలా చెల్లించక పోవడంతో ఆర్థిక కష్టాలు పడుతున్నారు. అప్పులు చేసి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కృషి చేసినా తమకు కనీసం ఆ డబ్బులైన చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఉన్నతాధికారులకు నివేదించాం
సుధాకర్‌రెడ్డి, జైనూర్ ఇన్‌చార్జి ఎంపీడీవో
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కార్యదర్శు లకు రావాల్సిన ఖర్చులపై ఉన్నతాధికా రులకు నివేదిక పంపాం. ఓపీఎస్ పంచాయతీ కార్యదర్శులకు వేతనాలు అందని మాట వాస్తవమే. ఉన్నతాధికా రులు ప్రభుత్వానికి నివేదించారు. త్వరలో పెండింగ్ వేతనాలు మంజూరయ్యే ఆవకాశం ఉంది.