Share News

kumaram bheem asifabad- రాబందులు కనుమరుగు

ABN , Publish Date - Apr 15 , 2026 | 10:19 PM

పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే పక్షి జాతుల్లో ప్రధానమైన రాబందుల జాతి క్రమంగా అంతరించి పోతోంది. ఒకప్పుడు గ్రామ పొలిమేరల్లో ఎక్కడ పశువుల కళేబరాలు కనబడినా వచ్చి వాలే రాబం దులు ఇప్పుడు అత్యంత వేగంగా అతరించి పోయే పక్షుల జాబితాలో చేరి పోయాయి. గత 20 ఏళ్లలో మన దేశంలో సుమారు నాలుగు కోట్ల రాబందులు అంతరించి పోయినట్లు పర్యావరణ శాస్త్రవేత్తలు లెక్క తేల్చారు.

kumaram bheem asifabad- రాబందులు కనుమరుగు
లోగో

- పాలరాపుగ్టుటపై గతంలో 30కి పైగా జాతుల సంచారం

- నిధుల లేమి సంరక్షణ చర్యలు లేక వలస

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే పక్షి జాతుల్లో ప్రధానమైన రాబందుల జాతి క్రమంగా అంతరించి పోతోంది. ఒకప్పుడు గ్రామ పొలిమేరల్లో ఎక్కడ పశువుల కళేబరాలు కనబడినా వచ్చి వాలే రాబం దులు ఇప్పుడు అత్యంత వేగంగా అతరించి పోయే పక్షుల జాబితాలో చేరి పోయాయి. గత 20 ఏళ్లలో మన దేశంలో సుమారు నాలుగు కోట్ల రాబందులు అంతరించి పోయినట్లు పర్యావరణ శాస్త్రవేత్తలు లెక్క తేల్చారు. పూర్తిగా అంతరించి పోయే క్రమం లో రాబందుల ఉనికిని కుమరం భీం జిల్లాలో కనుగొన్నారు. వాటి సంరక్షణకు సరైన చర్యలు చేపట్టని కారణంగా మళ్లీ కనుమరుగయ్యాయి. పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే పక్షి జాతుల్లో రాబందులు ప్రధానమైనవి. అధికారుల నిర్లక్ష్యం, నిధుల లేమి, సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో పర్యావరణాన్ని ప్రభావితం చేసే పక్షి జాతుల్లో కీలకమైన రాబందులు రాను రాను కనుమరుగ వుతున్నాయి.

- పాలరాపు గుట్ట ప్రాంతంలో..

పెంచికలపేట మండలం అటవీ ప్రాంతంలోని పాలరాపుగుట్ట రాబందులకు ఆవాసంగా ఉండేది. పెంచికలపేట మండలం మొర్లిగూడ అటవీ ప్రాం తంలోని ప్రాణహిత పెద్దవాగు నదుల సంగమం తీరాన 200 మీటర్ల ఎత్తులో గల పాలరాపు గుట్టపై చిన్న ఇన్న తొరికలను రాబందులు స్థావరా న్ని ఏర్పర్చుకున్నాయి. 2013లో అప్పటి బెజ్జూరు మండల అటవీ రేంజ్‌ అధికారి రామ్మోహన్‌ రాబందుల ఉనికిని గుర్తించారు. అంతరించిపోతు న్న జీవుల్లో రాబందు ఒకటి కావడంతో వాటి ఉనికిని కాపాడేందుకు నిధులు వెచ్చించి సంరక్షణ చర్యలు చేపట్టారు. రాబందుల ఆవాస కేంద్రమైన పాలరాపు గుట్ట వద్ద రాబందుల ఆహారం కోసం రెండు రోజులకు ఒక సారి ఒక పశువు కళేబరాన్ని వేసి రక్షణ చర్యలు చేపట్టారు. రాబందులను రక్షిం చేందుకు అయిదు ఎకరాల్లో కంచె సైతం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. రాబందుల కదిలికలను గుర్తించేందుకు ఓ పరిశోధకుడితో పాటు ప్రత్యేక బేస్‌ క్యాంపును ఏర్పాటు చేశారు. దీంతో రాంబదుల సంఖ్య క్రమేపీ పెరిగి 30 వరకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అప్పటి అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పాలరాపు గుట్టను జఠాయువుపేరిట పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అనంతరం రాబందుల సంరక్షణ అటవీ అధికారులు గాలికి వదిలేశారు. పాలకుల, అధికారుల నిర్లక్ష్యం, సంరక్ష ణ కోసం నిధులు రాకపోవడం, ఆహారం దొరకక రాబందులు మహారాష్ట్రలోని కమలాపూర్‌ వల్చర్‌ పాయింట్‌కు వలస వెళ్లాయి. కొంత కాలంగా పాల రాపుగుట్టపై ఒక్క రాబందు కూడా కనిపించలేదు. రాబందులకు ఆహారం అందించేందుకు నిధులు రాలేదు. దీతో ఆహారం దొరకక రాబందులు స్థావరాన్ని మార్చాయి. దీనికి తోడు భారీ వర్షాలకు రాబందుల గూళ్లు దెబ్బతిన్నాయి. ప్రతి ఏటా శీతాకాలంలో హిమాలయాల నుంచి ఇక్కడికి వచ్చే హిమాలయన్‌ గ్రీఫిన్‌ సంతతి రాబందు గత నాలుగు సంవత్సరాలుగా రావడం లేదని అటవీశాఖ అధికారులు అంటున్నారు. అరుదైన పక్షి జాతి సంతతికి చెందిన రాబందులు ఆవాసా న్ని విడిచి వలస వెళ్లడంతో ప్రకృతి ప్రేమికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి రాబందుల ఆవాస కేంద్రానికి నిదులు మంజూరు చేసి వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

- మానవాళికి నేస్తాలు..

మానవ మనుగడకు రాబందులు ఎంతగానో మే లు చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతారు. ప్రతి ని త్యం వివిద రకాల పశువులు, జంతువులు మృత్యు వాత పడడం గమనిస్తాం. వివిధ రకాల పశువులు, జంతువులు మృత్యువాత పడ్డ వాటి కళేబరాలను కుళ్లి పోక ముందే రాబందులు పూర్తిగా ఆహారంగా వాటిని స్వీకరిస్తాయి. పశువులకు వ్యాధులు సంక్ర మించిన క్రమంలో విచ్చలవిడిగా డైక్లోఫినాక్‌ ఇంజ క్షన్లు వాడుతున్నారు. డైక్లోఫినాక్‌ ఇంజక్షన్లు వాడిని పశువుల కళేబరాలను తిన్ని రాబందులు మృత్యు వాత పడుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వారి సూచన మేరకు డైక్లోఫెనాక్‌ ఇంజక్షన్లు పూర్తిగా నిషేధించారు. సరైన పర్యవేక్షణ లేక విచ్చలవిడిగా ఇంజక్షన్లు ఉపయోగిస్తున్నారు. దీంతో రాబందుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. చనిపోయిన జంతు కళేబరాలను పూర్తిగా రాబం దులు ఆరగిస్తాయి. దీని వల్ల వివిధ రకాల వైరస్‌ బ్యాక్టీరియాలు వంటి వివిధ భయంకర వ్యాధుల నుంచి మనిషితో పాటు ఇతర జీవరాశులను కాపాడగలుగుతాయి. జంతు కళేబరాలను వదిలి వేసినట్లయితే కుళ్లిన జంతు మాంసం అలాగే పడి ఉండడం వల్ల దాని ప్రభావం సమీప చెరువులు, వాగులు నీటి వనరులపై ప్రభావం పడడం వల్ల పలు రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. వ్యాధులు వ్యాపించకుండా నివారించే పక్షి కేవలం రాబందు మాత్రమే అని పరిశోధనలు చెబుతున్నా యని అధికారులు గుర్తించారు. మానవ మనుగడ కు రాబందులు ఎంతగానో మేలు చేస్తున్నాయని చెప్పడానికి ఇది నిదర్శణమని చెబుతున్నారు.

Updated Date - Apr 15 , 2026 | 10:19 PM