Share News

బీఆర్‌ఎస్‌‌కు ఓటు వేస్తే మురుగు కాల్వలో వేసినట్టే

ABN , Publish Date - Feb 09 , 2026 | 02:37 AM

మునిసిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు ఓటు వేస్తే మురుగు కాలువలో, చెత్త బుట్టలో వేసినట్లేనని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

బీఆర్‌ఎస్‌‌కు ఓటు వేస్తే మురుగు కాల్వలో వేసినట్టే

  • సన్నబియ్యం పథకం గేమ్‌ చేంజర్‌

  • 2028లో కూడా కాంగ్రె్‌సదే అధికారం

  • మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సూర్యాపేట, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు ఓటు వేస్తే మురుగు కాలువలో, చెత్త బుట్టలో వేసినట్లేనని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. గతంలో పేదలకు దొడ్డు బియ్యం పంపిణీచేస్తే అడ్డదారిపట్టేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత సన్నబియ్యంతో పేదల ఆకలి తీరుతోందని చెప్పారు. సన్నబియ్యం పథకం ముమ్మాటికీ గేమ్‌చేంజర్‌ అని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా 40లక్షల కొత్తరేషన్‌కార్డులు అందించిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రజాపాలన చేస్తున్న కాంగ్రెస్‌, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అధికారం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట మునిసిపాలిటీని రాష్ట్రంలోనే ఉత్తమ మునిసిపాలిటీగా మరో స్థాయికి తీసుకువెళ్లడం ఖాయమని అన్నారు. ఎస్సారెస్పీ ఫేజ్‌-2 కాల్వ ఆధునికీకరణ కోసం ప్రత్యేక దృష్టిసారించామన్నారు. దేవాదుల ప్రాజెక్టు-6 ద్వారా తుంగతుర్తి నియోజకవర్గానికి సాగు నీరు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

Updated Date - Feb 09 , 2026 | 02:37 AM