ఓటర్ల సవరణ పకడ్బందీగా చేపట్టాలి
ABN , Publish Date - Jun 09 , 2026 | 11:29 PM
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కా ర్యక్రమం పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ రాములు పే ర్కొన్నారు. మంగళవారం జైపూర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని బీ సెక్షన్ సూపరింటెండెంట్ మధుసూదన్‌తో కలిసి సందర్శించి సిబ్బం దితో సమావేశం నిర్వహించారు.
జిల్లా అదనపు కలెక్టర్ రాములు
జైపూర్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి) : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కా ర్యక్రమం పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ రాములు పే ర్కొన్నారు. మంగళవారం జైపూర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని బీ సెక్షన్ సూపరింటెండెంట్ మధుసూదన్‌తో కలిసి సందర్శించి సిబ్బం దితో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా మూడవ విడత సర్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎ లాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలన్నారు. అలాగే ప్ర భుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి పోర్టల్‌ను తీసుకు వచ్చిందని, ఈ క్రమంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలన్నారు. సాదాబైనామా దరఖాస్తులను విచారణ చేసి క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించాలన్నారు. కార్యాలయం సిబ్బంది సమ య పాలన పాటించాలని, ప్రజలతో స్నేహ పూర్వకంగా మెలగాలన్నారు సర్టిఫికెట్లను నిర్ణీత గడువులోగా జారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ వనజారెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.