Share News

ఓటు నమోదు ప్రతీ ఒక్కరి బాధ్యత

ABN , Publish Date - Nov 01 , 2026 | 11:27 PM

పట్టభద్రుల ఓటు నమోదును అర్హులైన ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర ఫుడ్‌కమీషన్‌ చైర్మెన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

ఓటు నమోదు   ప్రతీ ఒక్కరి బాధ్యత
లింగారెడ్డిపల్లిలో మాట్లాడుతున్న గోలి శ్రీనివాస్‌రెడ్డి

- రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి

వెల్దండ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : పట్టభద్రుల ఓటు నమోదును అర్హులైన ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర ఫుడ్‌కమీషన్‌ చైర్మెన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని లింగారెడ్డిపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాలలో ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియను శ్రీనివాస్‌రెడ్డి ప్రారంబించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి ఓటునమోదు చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్‌ హయాంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రతీ ఒక్కరు గుర్తించాలన్నారు. నిరుద్యోగ యువతకోసం అహర్నిశలు కృషిచేసిన ఘనత కేవలం బీఆర్‌ఎస్‌దేనన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన హామీలను అమలుచేయడంలో పూర్తిగా విఫలమయ్యిందని విమర్శించారు. పాలక ప్రభుత్వానికి కళ్లుతెరిపించే విదంగా రాబోవు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండాలన్నారు. అన్నివర్గాల ప్రజలకు బీఆర్‌ఎస్‌పార్టీనే శ్రీరామరక్ష అని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపల్‌ మాజీ చైర్మెన్‌ ఎడ్మసత్యం, పార్టీ మండల అధ్యక్షుడు పుట్ట రాంరెడ్డి, మాజీ వైస్‌ఎంపీపీ అనిల్‌కుమార్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌లు నాగులునాయక్‌, శేఖర్‌, మాజీ సర్పంచ్‌ ఎడ్మవెంకట్‌రెడ్డి, అల్లాజీ, ఆనందు, నిరంజన్‌, అంజిమాస్టర్‌, నాగయ్య ఉన్నారు.

బాధితునికి ఆర్థిక సాయం

కల్వకుర్తి, (ఆంధ్రజ్యోతి) : కల్వకుర్తి పట్టణ పరిధిలోని జేపీనగర్‌ తండాకు చెందిన జానీ అ నారోగ్యంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఫుడ్‌ కమి షన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మునిసి పల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యంతో కలిసి ఆసుపత్రికి వెళ్లి అతన్ని పరామ ర్శించారు. కొంత ఆర్థికసాయం అందజేశారు. బీఆర్‌ఎస్‌ వెల్దండ మండల అధ్యక్షుడు పుట్ట రాంరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2026 | 11:27 PM