kumaram bheem asifabad-ఓటరు మ్యాపింగ్ ఫారాలు త్వరగా అందజేయాలి
ABN , Publish Date - Jul 22 , 2026 | 10:54 PM
బీఎస్‌వోలకు ఓటరు మ్యాపింగ్ ఫారాలు త్వరగా అందజేయాలని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్‌రావ్ కోరారు. స్థానిక మేజర్ గ్రామ పంచాయతీలో బుధవారం సర్పంచ్ కొడప ప్రకాష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్‌మాట్లాడారు. సర్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
జైనూర్, జూలై 22 (ఆంధ్రజ్యోతి: బీఎస్‌వోలకు ఓటరు మ్యాపింగ్ ఫారాలు త్వరగా అందజేయాలని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్‌రావ్ కోరారు. స్థానిక మేజర్ గ్రామ పంచాయతీలో బుధవారం సర్పంచ్ కొడప ప్రకాష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్‌మాట్లాడారు. సర్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అర్హులందరూ నిర్ణీత గడవులోగా ఫారాలను పూర్తి చేసి సంబంధిత బీఎల్‌వోలకు అందజేయాలని సూచించారు. బీఎల్‌వోలు ఇంటింటికీ తిరిగి ఫారాలు పూర్తి చేయాల్సి అవసరం ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేపడుతున్న సర్ కార్యక్రమం ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని కోరారు. సమావేశంలో ఉప సర్పంచ్ డోంగ్రే ప్రకాష్ సీనియర్ నాయకులు మేస్రాం అంబాజీఈవో కోరేంగ ఆనంద్‌రావ్, వార్డు సభ్యులు రహీంఖాన్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఇంతీయాజ్‌లాల, డీసీసీ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ ముకీద్, నాయకులు సొనకాంబ్లే సిధ్ధు తదితరులు పాల్గొన్నారు.