ఓటరు జాబితా గడువు పెంపు...
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:44 PM
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఓటరు తుది జాబితా ప్రచురణ గ డువు పెంచుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ఉత్త ర్వులు జారీ చేసింది. ముందుగా పేర్కొన్న ప్రకారం అ భ్యంతరాలు స్వీకరించిన అనంతరం ఓటరు తుది జాబి తాను ఈ నెల 10వ తేదీన ప్రచురించాల్సి ఉండగా, రెం డు రోజులు అదనంగా గడువు పెంచుతూ ఈసీ నిర్ణ యం తీసుకుంది.
-ఈ నెల 12న ఫైనల్ లిస్ట్ విడుదల
-డీ లిమిటేషన్‌పై అభ్యంతరాల వెల్లువ
-మంచిర్యాల కార్పొరేషన్‌లో సరిహద్దు సమస్యలే అధికం
-అభ్యంతరాల పరిశీలనలో మున్సిపాలిటీల సిబ్బంది
మంచిర్యాల, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఓటరు తుది జాబితా ప్రచురణ గ డువు పెంచుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ఉత్త ర్వులు జారీ చేసింది. ముందుగా పేర్కొన్న ప్రకారం అ భ్యంతరాలు స్వీకరించిన అనంతరం ఓటరు తుది జాబి తాను ఈ నెల 10వ తేదీన ప్రచురించాల్సి ఉండగా, రెం డు రోజులు అదనంగా గడువు పెంచుతూ ఈసీ నిర్ణ యం తీసుకుంది. ఓటరు జాబితా తప్పుల తడకగా ఉం దంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో అభ్యంత రాల స్వీకరణకు మరో రెండు రోజులపాటు అవకాశం క ల్పించింది. జిల్లాలో వుంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు లక్షెట్టిపేట, చెన్నూరు, క్యాతన్‌పల్లి, మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా మున్సిపా లిటీల పరిధిలో మొత్తం 173 వార్డులు ఉన్నాయి. మంద మర్రి మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా, అక్కడ ఈ దఫా ఎన్నికలు నిర్వహించడం లేదు. అదిపోను మిగతా 149 వార్డులకు ప్రస్తుతం ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అన్ని మున్సిపాలిటీల్లోనూ వార్డుల సవరణకు అధికారులు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు.
ఓటర్ల విభజనపై అభ్యంతరాల వెల్లువ...
జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు జరుగనున్న అన్ని మున్సి పాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల కేటాయింపు శాస్త్రీ యంగా జరగలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. గతంలో ఉన్న వార్డులను ఇష్టారీతిన మార్చారని, వార్డులకు ఓటర్ల విభజనలో పెద్ద మొత్తంలో తప్పులు చోటు చేసుకున్నాయనే ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. మంచిర్యాల కార్పొరేషన్‌లో ఈ నెల 8వ తేదీ నాటికి మొత్తం 208 అభ్యంతరాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీలో 253 అభ్యంతరాలు రాగా, బెల్లంపల్లిలో 211 ఫిర్యాదులు వ చ్చాయి. అధికారులు స్వీకరించిన ఫిర్యాదులను రోజువా రీగా ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగి సే నాటికి మొత్తం ఫిర్యాదులను సవరించనున్నట్లు ము న్సిపల్ కమిషనర్లు చెబుతున్నారు.
సరిహద్దు సమస్యలే అధికం...
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి సరిహద్దు సమస్యలే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్‌లో నస్పూర్ మున్సిపాలిటీతోపాటు హాజీపూర్ మండలంలోని ఎనిమిది గ్రామ పంచాయతీలను విలీ నం చేశారు. ప్రస్తుతం అధికారులు స్వీకరిస్తున్న అభ్యం తరాల్లో విలీన ప్రాంతాల నుంచే అధికంగా వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా మంచిర్యాలలో న స్పూర్‌ను విలీనం చేసిన చోట, అలాగే మంచిర్యాలలో విలీనం చేసిన హాజీపూర్ మండలంలోని గ్రామ పంచా యతీల బార్డర్‌లలో ఓటర్ల బదలాయింపు పట్ల ఫిర్యా దులు వస్తున్నాయి. గతంలో నస్పూర్ పరిధిలో ఉన్న ఓ టర్లను ప్రస్తుతం
తోళ్లవాగు ఇవతలి వైపు డివిజన్‌లో విలీనం చేశా రు. గ్రామ పంచాతీలకు చెంన ఓటర్లను సైతం సమీ ప డివిజన్‌లో చేర్చారు. గతంలో ఉన్నచోటనే తమను కొనసాగించాలని ఆయా ప్రాంతాల ఓటర్లు ఫిర్యాదు చేస్తున్నారు. వివిధ డివిజన్‌లలో నిర్ణీత ఓటర్ల సం ఖ్యకు అనుగుణంగా బదలాయింపు చేసినట్లు అధి కారులు వివరిస్తున్నారు. ఇదిలా ఉండగా కార్పొరేష న్ పరిధిలో ఇప్పటి వరకు వచ్చిన అభ్యంతరాలు 208 నుంచి 190 సమస్యలను పరిష్కరించగా, మిగ తా వాటిని సైతం పరిగణలోకి తీసుకుంటామని అధి కారులు చెబుతున్నారు.
ఆ పేర్లు తొలగిస్తారా...?
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని జాఫర్ నగర్ పోలింగ్ బూత్ నంబర్లు 140, 142లలో ఓటర్ల కేటా యింపులో జరిగిన తప్పిదాలను సవరించాలనే డి మాండ్‌లు వినిపిస్తున్నాయి. పోలింగ్ స్టేషన్ 140లో చనిపోయిన ఏడుగురి పేర్లు జాబితాలో పొందు పరి చారు. ఓటరు లిస్టు సీరియల్ నెంబర్లు 643, 882, 1000, 1071, 1171, 1282, 1318 పొందు పరి చారు. అదే పోలింగ్ స్టేషన్‌లో సీరియల్ నెంబర్లు 213, 1371కి సంబంధించి ఇంటి నెంబర్లు ముద్రించక పో గా, 898లో అసలు ఓటరు పేరే లేకపోవడం గమ నార్హం. ఇక 688లో తప్పుడు పేరు నమోదు చేశా రు. ఇదే పోలింగ్ స్టేషన్‌లో 102-103, 222-223, 244-226, 400-1205, 411-412, 717-1378, 929-934, 947-97, 1077-879, 1280-1281, 1203-1366, 1375 -803, 1376-801, 1377-805, 1326-142, 1323- 1223, 1325-1224, 942-1155, 1283-1192, 21-426, తదితర 20 మంది పేర్లు ఇలా రెండు నెంబర్ల తో రెండు సార్లు నమోదయ్యాయి. పోలింగ్ స్టేషన్ 142 లో 11 మంది చనిపోయిన వారి పేర్లు మళ్లీ నమో దు చేశారు. సీరియల్ నెంబర్లు 139, 352, 358, 518, 558, 685, 686, 715, 821 1221, 1222కు సంబం ధించిన ఓటర్లు చనిపోగా, తిరిగి కొత్త ఓటరు లిస్టు లోనూ దర్శనమిస్తున్నాయి. వాటన్నంటినీ తొలగిం చాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అభ్యంతరాలను పరిశీలిస్తాం....
మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్ సంపత్‌కుమార్
కార్పొరేషన్ పరిధిలో స్వీకరించే అభ్యంతరాలన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించి, పరిష్కరించే విధంగా కృషి చే స్తాం. ఇక్కడ విలీన ప్రాంతాల నుంచే అధిక సమస్యలు వస్తున్నాయి. గతంలో గ్రామ పంచాయతీలలో ఉన్న ఓటర్లకు కార్పొరేషన్‌లోకి మారినట్లు అనుభూతిని కలి గించే పనిలో భాగంగా పక్క డివిజన్‌లో చేర్చడం జరి గింది. అంతేగానీ ఎక్కడో దూరంగా మరో డివిజన్‌లో చేర్చినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవం. అయిన ప్పటికీ వీలైనంత వరకు ఎక్కడి వారిని అక్కడే కొన సాగించే విధంగా జాబితాను సవరించేందుకు చర్యలు చేపడతాం.