Share News

kumaram bheem asifabad- సొంతూరికే ‘ఓటు’

ABN , Publish Date - Jul 18 , 2026 | 10:53 PM

భారత ఎన్నికల కమిషన్‌ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియతో పట్టణాల్లో ఓట్ల సంఖ్య తగ్గనుంది. పల్లెలు, పట్టణాలు, నగరాలలో ఓటు కలిగిన వారు ఇకపై ఒకే చోట పరిమితం కానున్నారు. వ్యవసాయ భూములు, ఇళ్లు ఉన్న సొంత గ్రామాల్లోనే ఓటు మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి చేయించుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. పట్టణాల్లో తద్వారా బోగస్‌ ఓట్లు తొలగిపోయి ఎన్నికల ఖర్చు, శ్రమ తగ్గుతుందని రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

kumaram bheem asifabad- సొంతూరికే ‘ఓటు’
లోగో

- సర్‌ ప్రక్రియతో ఎక్కడో ఒకచోట మాత్రమే పేరు

- పట్టణాల్లో తగ్గనున్న ఓటర్ల సంఖ్య

- స్వాగతిస్తున్న రాజకీయ పార్టీలు

బెజ్జూరు, జూలై 18 (ఆంధ్రజ్యోతి): భారత ఎన్నికల కమిషన్‌ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియతో పట్టణాల్లో ఓట్ల సంఖ్య తగ్గనుంది. పల్లెలు, పట్టణాలు, నగరాలలో ఓటు కలిగిన వారు ఇకపై ఒకే చోట పరిమితం కానున్నారు. వ్యవసాయ భూములు, ఇళ్లు ఉన్న సొంత గ్రామాల్లోనే ఓటు మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి చేయించుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. పట్టణాల్లో తద్వారా బోగస్‌ ఓట్లు తొలగిపోయి ఎన్నికల ఖర్చు, శ్రమ తగ్గుతుందని రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో రెండు మున్సిపాలిటీలు ఉన్నా యి. జిల్లా కేంద్రం ఆసిఫాబాద్‌తో పాటు కాగజ్‌ నగర్‌ పట్టణ కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. ఆయా పట్టణాల్లో నివాసముంటున్న గ్రామీణులు, వలసదారులలో చాలామంది ఇటు పట్టణంలో అటు వారి సొంత గ్రామాల్లోనూ ఓటు కలిగి ఉన్నా రు. ఇప్పుడు వారికి పట్టణంలో, సొంత గ్రామంలో ఎన్యూమరేషన్‌ ఫారాలను పంపిణీ చేశారు. ఒక వ్యక్తి ఒకే ఓటు నమోదు చేసుకునేలా ఎన్నికల సంఘం యాప్‌ను రూపొందించింది. అలాగే ఒకరు రెండు ప్రాంతాల్లో ఓటును నమోదు చేయించు కుంటే చట్టపరమైన చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్‌ హెచ్చరించింది. ఎన్యూమరేషన్‌ ఫారంలో ఆధార్‌ నంబర్‌, ఫోన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరా లను నింపాల్సి వస్తుంది. కానీ రెండు ప్రాంతాల్లో ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇస్తే చిక్కుల్లో పడే ప్రమాదముంది. దీంతో చాలా మంది తమ సొంత గ్రామాల్లో ఓటు కలిగి ఉండడానికి ఇష్టపడుతు న్నారు. వ్యవసాయ పొలాలు, సొంత ఇళ్లు కలిగిన గ్రామీణులు, వలసదారులు గుర్తింపు, గౌరవం, ప్రభుత్వ పథకాలు ఆశిస్తూ తమ సొంత గ్రామా ల్లోనే ఓటును నమోదు చేసుకునేలా ఎన్యూమ రేషన్‌ ఫారాలు ఇస్తున్నారు. తద్వారా పట్టణాల్లో ఓటర్ల సంఖ్య తగ్గనుంది.

- జిల్లాలో రెండు మున్సిపాలిటీలు..

జిల్లాలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ పట్టణాలు ఉండగా, ఆయా ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి పలువురు పట్టణాల్లో ఉంటున్నారు. కొంత మంది పిల్లల చదువుల కోసం, ఉపాధి కోసం, ఉద్యోగరిత్యా పలువురు పట్టణాల్లో స్థిరప డ్డారు. అయితే వారందరికి సొంత గ్రామాల్లో ఇళ్లు, వ్యవసాయ భూములు ఉండటంతో తరచూ రాకపోకలు సాగిస్తుంటారు. ఎన్నికల వేళ సొంత గ్రామాల్లోనే ఓటు వేసేందుకు మొగ్గుచూపుతు న్నారు. ఈక్రమంలో పల్లెల్లోనే ఓటు ఉంచుకునేలా ప్రణాళికలు చేసుకుంటున్నారు. పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలిస్తే స్థానికంగానే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అవకాశం ఉంటుందనే అభిప్రాయంతో సొంత గ్రామాల్లోనే ఓటు హక్కు ఉండేలా చూసుకుంటు న్నారు. ఇక కాగజ్‌నగర్‌ ఇండస్ర్టియల్‌ ప్రాంతంగా పేరు ఉండటంతో ఇక్కడ రాజస్తాన్‌, బిహర్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ లాంటి రాష్ర్టాల కార్మికులు కూడా స్థానిక ఓటర్లుగా మారారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిలో 50,764మంది ఓటర్లు, ఆసిఫాబాద్‌ పట్టణంలో 43,738మంది ఓటర్లు ఉన్నారు. దీంతో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లోని సొంత ఊర్లలోనే ఓటు హక్కు ఉండేలా చూసుకుం టున్నారు. దీంతంఓ పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశాలు ఉన్నాయి.

గ్రామాల్లో ఉండేలా తిప్పలు...

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలు పూర్తికాగా రాబోయే రోజుల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపాలిల్లోనూ ఎన్నికలు ముగిశాయి. దీంతో గ్రా మాల్లో, పట్టణాల్లో ఓట్లు ఉన్న ఓటర్లను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకుంటున్నారు. రెండుచోట్ల ఓటు ఉన్న వారిని గుర్తించి వారిని గ్రామాల్లోనే ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో రెండు నియోజకవర్గాలుండగా వలస ఓటర్లు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. ఉపాధి నిమిత్తం, ఇతర అవ సరాల కోసం పట్టణాల్లో సైతం చాలామంది ఓట ర్లు ఉన్నారు. ఈనేపథ్యంలో అక్కడ, ఇక్కడ ఓటు హక్కు కలిగిన వారికి గ్రామాల్లోనే ఓటు ఉండేలా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా డబుల్‌ ఓట్లు తొలగింపును రాజకీయ పార్టీల నాయకులు స్వాగతిస్తున్నాయి. బోగస్‌ ఓట్ల వల్ల కొత్త కాలనీ లలో ఓట్ల సంఖ్య గణనీయంగా పెరిగి, ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థులతో పాటు ఎన్నికల సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఓటర్లను కలిసి ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు, పార్టీల నాయకులు, పోల్‌ చీటీలను పంపిణీ చేసి ఏర్పాట్లు చేయడానికి ఇబ్బంది పడ్డారు. బోగస్‌ పోతే శ్రమ, ఖర్చు తగ్గుతాయని అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Jul 18 , 2026 | 10:53 PM