kumaram bheem asifabad- ఓట్ల కోత.. ఎవరికి వాత
ABN , Publish Date - Aug 16 , 2026 | 11:21 PM
జిల్లాలో భారీగా ఓటర్లు తొలగించడంతో రాజకీయ పార్టీల్లో అలజడి మొదలైంది. ఎన్నికల సంఘం నిర్వహించి న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ ముగిసింది. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవర ణలో భాగంగా అర్హులైన ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు అందజేసి వాటిద్వారా వివరాలను సేకరించి డిజిటలైజ్ చేశారు. సర్ గడువు రెండు సార్లు పొడిగించినప్పటికీ జిల్ల్లాలో ఓటర్ల ఎన్యూమరేషన్ అతి తక్కువగా జరిగింది.
- సర్ ప్రక్రియ ఎవరి కొంప ముంచుతుందోనని ఆందోళన
- జిల్లాలో భారీగా ఓట్ల గల్లంతు
- అధికార కాంగ్రెస్ పార్టీ సైతం మల్లగుల్లాలు
బెజ్జూరు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భారీగా ఓటర్లు తొలగించడంతో రాజకీయ పార్టీల్లో అలజడి మొదలైంది. ఎన్నికల సంఘం నిర్వహించి న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ ముగిసింది. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవర ణలో భాగంగా అర్హులైన ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు అందజేసి వాటిద్వారా వివరాలను సేకరించి డిజిటలైజ్ చేశారు. సర్ గడువు రెండు సార్లు పొడిగించినప్పటికీ జిల్ల్లాలో ఓటర్ల ఎన్యూమరేషన్ అతి తక్కువగా జరిగింది. తమ వద్దకు వచ్చిన ఎన్యూమరేషన్ పత్రాలను అధికా రులు డిజిటలైజేషన్ చేశారు. చనిపోయిన వారు, చిరునామా లభించనివారు, ఎన్యూమరేషన్ పత్రా లు ఇవ్వనివారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, రెండుచోట్ల ఓటర్లుగా నమోదైన వారి పేర్లను జాబితా నుంచి ఇప్పటికే తొలగించారు. జిల్లాలో భారీగా ఓటర్లు తొలగించడంతో రాజకీయ పార్టీల్లో ఆందోళన నెలకొన్నది. తొలగించిన ఓటర్లలో తమ మద్దతుదారులు, సానుభూతి పరులు ఎంతమంది ఉన్నారనేదానిపై అంచనాలు వేసుకుంటున్నారు. తొలగించిన ఓట్లు ఎవరికి లాభం?ఎవరికి నష్టం? అనేదానిపై ఆయా పార్టీల నేతలు బూత్‌స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. తొలగించిన జాబితాల ను చూసి అన్ని పార్టీలు నివ్వెరపోతున్నాయి.
- పల్లెలకే ఓటు..
సార్వాత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్లకుపైగా సమయం ఉన్నప్పటికీ ఓటర్లు తొలగింపుతో ఇప్పటి నుంచే అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చెందు తున్నాయి. ఈ సారి అనేక మంది ఓటర్లు తమ ఓటు హక్కును తమ ప్వగ్రామాల్లోనే నమోదు చేసుకునేందుకు ఆసక్తి చూపారు. ఈ కారణం చేత పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య తగ్గినట్లు తెలు స్తోంది. గత ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో జిల్లాలో రెండు నియోజకవర్గాల పరిదిలో అధికార పార్టీకి కాకుండా బీజేపి, బీఆర్‌ఎస్ పార్టీలకు ఓటర్లు పట్టం కట్టారు. అయితే ఇప్పుడు భారీగా ఓట్లు తొలగిం చడంతో ఎవరికి ప్రయోజనం కలుగుతుందనేది అంతుచిక్కడం లేదు. అధికార కాంగ్రెస్ ఎన్యూమ రేషన్ ప్రక్రియలో పూర్తిస్థాయిలో పాల్గొనలేదు. బీఆర్‌ఎస్ కూడా అంతంతమాత్రంగానే పాల్గొంది.
- తాజా పరిస్థితి ఇలా..
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో 678పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 2025 ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 4,55,596 మంది ఓటర్లు ఉన్నారు. ఓటరు జాబితా ప్రకారం 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇందులో 4,07,457మంది ఎన్యూ మరేషన్ పత్రాలు ఇవ్వగా వాటన్నింటిని డిజిటలైజే షన్ చేశారు. 48,139మంది తిరిగి ఇవ్వలేదు. దీంతో వారి ఓట్లు జాబితా నుంచి గల్లతైనట్లు అధికారులు గుర్తించారు. ఇంకా మృతి చెందిన, రెండు ఓట్లు గల వారు 21,797మంది ఉన్నారు. శాశ్వ తంగా వలస వెళ్లిన వారు, చిరునామా దొరకని వారు 26,342మంది ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఇంత భారీగా ఓటర్ల పేర్లు డిజిటలైజ్ కాకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. మ్యాపింగ్ కాని ఓటర్లలో తమ పేరు కూడా ఉందేమోనని కలవరపడుతు న్నారు.
- కొంత ఊరట..
సర్ ముసాయిదా జాబితాలో ఈ నెల 17న ప్రచురించనున్నామని, జాబితాలో పేరు కని పించ నంత మాత్రాన ఓటు రద్దయినట్లు కాదని, అభ్యం తరాల స్వీకరణ దశలో ఓటర్ల పేర్లను చేర్చుకునే అవకాశం కల్పించామని ఎన్నికల సంఘం చెప్పడం ఊరట కలిగిస్తోంది. ముసాయిదా జాబితా ప్రచు రణ అనంతరం ఈ అవకాశాన్ని వాడుకోవాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. నోటీసులు అం దిన వారందరినీ ఆయా పార్టీల బీఎల్‌ఏ కార్యకర్త లు స్వయంగా కలిసి వారితో బీఎల్‌వో, ఈఆర్‌వో, ఏఈఆర్‌వో, ఇతర ఎన్నికల అథికారుల వద్ద క్లెయి మ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసేట్లు చూడాలని నేతలు, ప్రజాప్రతినిధులు ఆదేశాలు జారీ చేశారు. బీఎల్‌వో కార్యకర్తలు తమ పరిదిలో నమోదు కాని ఓటర్లను స్వయంగా కలిసి పరిస్థితిని తెలుసుకొని పాత సర్ జాబితాలో వివరాలు అనుసంధానం కాలేదంటూ నోటీసులు అందుకున్న వారితో గడువు లోగా కోరిన వివరాలు, పత్రాలతో అధికారులను సంప్రదించేలా చూడాలని సూచించారు.
- తుది జాబితా ప్రచురించే నాటికి..
తుది జాబితా అక్టోబరు 19న ప్రచురించే నాటికి తమ ప్రాంతంలోని ఓటర్లలో ఏ ఒక్కరి పే ర్లు గల్లంతు కాకుండా నాయకులు ఇప్పటి నుంచి జాగ్రత్త పడుతున్నారు. కాగా ఓటర్ల ఎన్యూమ రేషన్ ఫారాల దాఖలు ఘట్టం ముగిసింది. ఈనెల 17న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. ఈనెల 17నుంచి సెప్టెంబరు 16వరకు క్లెయిము లను, అభ్యంతరాలను స్వీకరిస్తారు. అక్టోబరు 15వ రకు అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరిస్తారు. అక్టోబరు 19న తుది జాబితాను ప్రకటిస్తారు. కానీ ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వని లేదా, మ్యాపింగ్ కాని వ్యక్తి పేరు ఈనెల 10వ తేదీ శాశ్వతంగా పోయినట్లు భావించరాదని అధికారులు చెబుతు న్నారు. ఈనెల 17న వచ్చే ముసాయిదా జాబితాలో పేరు ఉందో లేదో ప్రతి ఓటరూ తనిఖీ చేసుకో వాలని సూచిస్తున్నారు. పేరు లేకుంటే అభ్యంతరం తెలియజేయడం ద్వారా తిరిగి జాబితాలో చేరే అవ కాశం ఉంది.