kumaram bheem asifabad-వీవోఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
ABN , Publish Date - May 29 , 2026 | 10:33 PM
వీవోఏల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. రెబ్బెనలో వీవోఏలు చేపడుతున్న దీక్షా శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు.
రెబ్బెన, మే 29 (ఆంధ్రజ్యోతి): వీవోఏల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. రెబ్బెనలో వీవోఏలు చేపడుతున్న దీక్షా శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీవోఏలకు వేతనాలు పెంచడం లేదన్నారు. తక్కువ వేతనాలు చెల్లిస్తూ వారితో వెట్టిచాకిరి చేయిస్తున్నారని చెప్పారు. వేతనాలు శ్రమకు తగ్గ విధంగా పెంచాలని కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీవోఏల సమస్యలను పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని తెలిపా రు. కార్యక్రమంలో వీవోఏ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
కౌటాల, (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐకేపీ వీవోఏ చేపడుతున్న సమ్మె కొనసాగుతోంది. శుక్రవారం నాటికి 12వ రోజుకు చేరు కుంది. 12 రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో గడ్డి తింటూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తాము 12 రోజులుగా దీక్షలు చేపడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రజా ప్రభుత్వమని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు తమ సమస్యలను చిన్నచూపు చూడడం సరికాదని వాపోయారు. ఇప్పటికైనా తమ డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో వీవోఏలు పాల్గొన్నారు.