బాల్క సుమన్ గూండా రాజ్యం నడవదు: వివేక్
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:56 AM
బాల్క సుమన్ గూండా రాజ్యం నడవదని మంత్రి వివేక్ వెంకటస్వామి హెచ్చరించారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): బాల్క సుమన్ గూండా రాజ్యం నడవదని మంత్రి వివేక్ వెంకటస్వామి హెచ్చరించారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ వాళ్లు తమని అడ్డుకుని రాళ్లు విసిరారని, తమ వాహనంపై దాడి చేశారని అన్నారు. ఇంకా.. గూండా రాజ్యం నడపాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. బాల్క సుమన్ ఉద్దేశ పూర్వకంగానే శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని ఆరోపించారు. ఇకనైనా ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలని హితబోధ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీలా ఫాంహౌ్‌సలో పడుకుని తాము పాలన చేయడం లేదన్నారు. తెలంగాణ మంత్రివర్గం ఢిల్లీ పర్యటనపై బీఆర్‌ఎస్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, అధిష్ఠానం ఢిల్లీలో ఉంటుందని, 100 సార్లయినా ఢిల్లీ వస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రాంతీయ పార్టీ అని దానికి ఢిల్లీలో కార్యాలయం ఎందుకని ప్రశ్నించారు.