Share News

వీఐటీ ఉపాధ్యక్షుడికి గౌరవ డాక్టరేట్‌

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:39 AM

వేలూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీఐటీ) ఉపాధ్యక్షుడు శంకర్‌ విశ్వనాథన్‌కు థాయ్‌ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది...

వీఐటీ ఉపాధ్యక్షుడికి గౌరవ డాక్టరేట్‌

చెన్నై, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): వేలూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీఐటీ) ఉపాధ్యక్షుడు శంకర్‌ విశ్వనాథన్‌కు థాయ్‌ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. థాయ్‌లాండ్‌లోని ‘రాజమంగళం యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ కృంగ్‌తెప్‌’ (ఆర్‌ఎంయూటీకే) ద్వారా ‘ఇంజనీరింగ్‌ మరియు టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌’లో డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ గౌరవ డిగ్రీని ఆయనకు ప్రదానం చేశారు. ప్రివి కౌన్సిల్‌ ఆఫ్‌ థాయ్‌లాండ్‌ పాలకొర్న్‌సువన్‌రథ్‌, రాజమంగళ యూనివర్సిటీ అధ్యక్షుడు డాక్టర్‌ పిచ్చైజన్మనీ తదితరులు ఈ డాక్టరేట్‌ను ఓ ప్రత్యేక కార్యక్రమంలో శంకర్‌ విశ్వనాథన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శంకర్‌ మాట్లాడుతూ.. భారత్‌, థాయ్‌లాండ్‌ ఉమ్మడి సంస్కృతి, జ్ఞాన వ్యవస్థలను గుర్తు చేసుకున్నారు. ఇరుదేశాల మధ్య చురుకైన విద్యా సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ వేడుకల్లో వీఐటీ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ జి.విశ్వనాథన్‌, రమణి బాలసుందరం, అసిస్టెంట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ కాదంబరి ఎస్‌.విశ్వనాఽథన్‌, డాక్టర్‌ శ్రవణ్‌ కృష్ణ తదితరులు కూడా పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 01:39 AM