Share News

క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్శిటీ ర్యాంకుల్లో ‘వీఐటీ’ ఘనత

ABN , Publish Date - Mar 27 , 2026 | 04:24 AM

ప్రతిష్ఠాత్మక ‘క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్శిటీ’ ర్యాంకుల్లో ‘వేలూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ (వీఐటీ) రికార్డు సృష్టించింది. తాజాగా విడుదలైన ర్యాంకుల్లో ప్రపంచంలోని...

క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్శిటీ ర్యాంకుల్లో ‘వీఐటీ’ ఘనత

చెన్నై, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మక ‘క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్శిటీ’ ర్యాంకుల్లో ‘వేలూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ (వీఐటీ) రికార్డు సృష్టించింది. తాజాగా విడుదలైన ర్యాంకుల్లో ప్రపంచంలోని టాప్‌-200 యూనివర్సిటీల జాబితాలో చోటు సంపాదించడమే కాకుండా, మొత్తం 17 సబ్జెక్టుల్లో గ్లోబల్‌ ర్యాంకులు సాధించి సత్తా చాటింది. ఇంజనీరింగ్‌, టెక్నాలజీ, సైన్సెస్‌, మేనేజ్‌మెంట్‌, అగ్రికల్చర్‌ , డిజైన్‌ రంగాల్లో గణనీయమైన పురోగతిని నమోదు చేసింది. ప్రపంచ విద్యా అగ్రగాములతో పోటీ పడుతూ ఇంజనీరింగ్‌ మరియు టెక్నాలజీ విభాగాల్లో వీఐటీ 119వ ర్యాంకును కైవసం చేసుకుంది. గతేడాది 142వ స్థానంలో ఉండగా, ఈసారి ఏకంగా 23 స్థానాలు మెరుగుపరచుకోవడం విశేషం. జాతీయస్థాయిలో 6వ ర్యాంకును, గణితంలో 5వ ర్యాంకు దక్కించుకుంది. కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ర్టానిక్స్‌, డేటా సైన్స్‌ అండ్‌ ఏఐ, మెకానికల్‌ వంటి విభాగాల్లో దేశంలోనే టాప్‌-10లో నిలిచింది. ఈ సందర్భంగా వీఐటీ వ్యవస్థాపకుడు, చాన్స్‌లర్‌ జి.విశ్వనాఽథన్‌ మాట్లాడుతూ.. విద్యాబోధన, పరిశోధనల్లో అత్యున్నత ప్రమాణాలు పాటించడమే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు. ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు వీఐటీ కృషి చేస్తోందని, కేంద్రీకృత పాఠ్యప్రణాళిక వల్లే ఈ గుర్తింపు లభించిందని తెలిపారు.

Updated Date - Mar 27 , 2026 | 04:24 AM