kumaram bheem asifabad- మార్లవాయిని సందర్శించి.. సమస్యలు తెలుసుకుని..
ABN , Publish Date - Jan 08 , 2026 | 10:21 PM
మండలంలోని మార్లవాయిని ఎస్పీ నితికా పంత్ గురువారం సందర్శించి.. గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కనక ప్రతిభ అధ్వర్యంలో ఆదివాసీలు ఎస్పీకి గిరిజన సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ నితికా పంత్ హైమన్‌డార్ఫ్ దపంతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు.
జైనూర్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మార్లవాయిని ఎస్పీ నితికా పంత్ గురువారం సందర్శించి.. గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కనక ప్రతిభ అధ్వర్యంలో ఆదివాసీలు ఎస్పీకి గిరిజన సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ నితికా పంత్ హైమన్‌డార్ఫ్ దపంతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఇందులో భాగంగా డార్ఫ్ దపంతులు ఆదివాసీలకు చేసిన సేవలను గ్రామస్థుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం ఎస్పీ డార్ఫ్ రీడింగ్ రూం, ఆశ్రమోన్నత పాఠశాల, వందేళ్ల చరిత్ర కలిగిన మర్రి చెట్టు తదితర ప్రాంతాలను సందిర్శించి అక్కడి పరిస్థితులు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం గ్రామస్థులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ సందర్భం గా మహిళలకు బ్లాకెంట్లను పంపిణీ చేశారు. ఈ నెల 11న నిర్వహించనున్న డార్ఫ్ దపంతుల వర్ధంతి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జైనూర్ సీఐ రమేశ్ ఎస్సై రవికుమార్, గ్రామపటేల్ ఆత్రం హన్మంత్‌రావ్, దేవిరి గణపత్ పాల్గొన్నారు.