Share News

kumaram bheem asifabad- ఇస్రోను సందర్శించి.. అంతరిక్ష సాంకేతికతను వీక్షించి..

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:07 PM

జిల్లాకు చెదిన విద్యార్థులు గురువారం ఇస్రోను సందర్శించి అంతరిక్ష సాంకేతికతను ప్రత్యక్షంగా వీక్షించారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఉత్తర్వులతో ‘హర్‌ ఇండియన్‌ కా మూన్‌ షాట్‌ - శ్రీహరికోట విజిట్‌ 2026’ ఇస్రో విద్యా పర్యటనకు జిల్లా నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు ఎంపికయ్యారు.

kumaram bheem asifabad- ఇస్రోను సందర్శించి.. అంతరిక్ష సాంకేతికతను వీక్షించి..
ఇస్రో పర్యటనలో పాల్గొన్న జిల్లా విద్యార్థులు

ఆసిఫాబాద్‌రూరల్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు చెదిన విద్యార్థులు గురువారం ఇస్రోను సందర్శించి అంతరిక్ష సాంకేతికతను ప్రత్యక్షంగా వీక్షించారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఉత్తర్వులతో ‘హర్‌ ఇండియన్‌ కా మూన్‌ షాట్‌ - శ్రీహరికోట విజిట్‌ 2026’ ఇస్రో విద్యా పర్యటనకు జిల్లా నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన కార్తీక్‌, శివచరణ్‌, సాక్షిత్‌, దిలీప్‌, హర్షిత్‌, ఆకాష్‌, అంజన్నలు ఎంపిక కాగా జిల్లా సైన్స్‌ అధికారి మధుకర్‌ ఆధ్వర్యంలో అంతరిక్ష సాంకేతికతను ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరిక్ష కలలకు ఇస్రో యాత్ర దారి చూపుతుందన్నారు. ఈ నెల 25 నుంచి 27 వరకు నిర్వహించే ప్రత్యేక యాత్రలో రాష్ట్రంలోని ఏడు జిల్లాల నుంచి 72 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ను సందర్శించి రాకేట్‌ ప్రయోగాల విధానం, ఉపగ్రహాల నిర్మాణం, ఆధునిక అంతరిక్ష సాంకేతికతలను ప్రత్యక్షంగా పరిశీలించారు. శాస్త్రవేతలతో జరిగిన ప్రత్యక్ష చర్చల ద్వారా విద్యార్థులు తమ సందేహాలకు సమాధానాలు పొందారు.

Updated Date - Mar 26 , 2026 | 11:07 PM