kumaram bheem asifabad- వాస్తు శిల్పి పితామహుడు విశ్వకర్మ
ABN , Publish Date - Sep 17 , 2026 | 11:32 PM
నివాళులు అర్పించిన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్
ఆసిఫాబాద్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందని రోజుల్లో గొప్ప నిర్మాణాలు చేసిన శిల్పి, విశ్వకర్మ అని మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం బీసీసంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వకర్మజయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిత, ఎస్పీ నితికా పంత్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ డేవిడ్, ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ హర్ష్ చౌదరి, జిల్లా గ్రంథాయలసంస్థ చైర్మన్ కామ్డె అనిల్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఆకాష్, ఆహ్మద్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, పీఏసీఎస్ చైర్మన్ ఆలీబీన్ ఆహ్మద్, జిల్లా బీసీ సంక్షేమాధికారి నదీం, విశ్వబ్రహ్మణ సంఘం నాయకులు భాస్కరచారి, సురేష్‌చారి, శ్రీమంతుల వేణుగోపాల్, రాధాకృష్ణచారి తదితరులు పాల్గొన్నారు. కాగా జిల్లా కేంద్రంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో గురువారం విశ్వకర్మ జయంతిని విశ్వబ్రహ్మణులు ఘనంగా నిర్వహించారు. అలయ అర్చకుడు సత్యనారయణచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అలాగే మండలంలోని గుండి గ్రామంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీరాములు, వరప్రసాద్, తిరుపతి, రమేష్, వెంకటయ్య, భాస్కరాచారి, సురేష్‌చారి, అశోక్, వేణుగోపాల్, రాధాకృష్ణచారి, రమేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్/తిర్యాణి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): విశ్వ బ్రాహ్మణుల ఆరాధ్యదైవమైన విశ్వకర్మ భాగవానుని జయంతి వేడుకలు గురువారం కాగజ్‌నగర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుని విగ్రహానికి పూజలు చేశారు. అలాగే తిర్యాణిలో పెర్కపల్లిలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో గురువారం రంగనాయక ఆలయ ప్రాంగణంలో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణ సంఘం ఆద్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా విశ్వకర్మ విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. జెండాను ఎగురవేసిన అనంతరం నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్‌రావు, సీనియర్ అసిస్టెంట్ అచ్యుత్‌రావు, రంగనాయక ఆలయ కమిటి అద్యక్షుడు తంగడిపల్లి మహేష్, విశ్వబ్రాహ్మణ సంఘం మండల అద్యక్షుడు పురుషోత్తం, సభ్యులు బ్రహ్మయ్య, శ్రీకాంత్, మోహన్, ప్రబాకర్, షణ్ముఖ, శ్రీనివాస్, శ్రీదర్, అశోక్, ఆలయ పూజారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.