Share News

అసెంబ్లీలో నేతల ముచ్చట్లపై ఆసక్తికర చర్చ

ABN , Publish Date - Mar 28 , 2026 | 05:23 AM

అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో.. అసెంబ్లీ హాల్లో ఒకేచోట ఇద్దరు మంత్రులు..

అసెంబ్లీలో నేతల ముచ్చట్లపై ఆసక్తికర చర్చ

  • ఒకే బెంచిపై శ్రీధర్‌బాబు, పొన్నం, కేటీఆర్‌, హరీశ్‌లు

హైదరాబాద్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో.. అసెంబ్లీ హాల్లో ఒకేచోట ఇద్దరు మంత్రులు, ఇద్దరు మాజీ మంత్రులు కూర్చుని ముచ్చటించుకోవడంపై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. గురువారం అసెంబ్లీ హాల్లో.. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ కూర్చున్న బెంచీలపై పక్కనే మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు కూర్చుని పలు అంశాలపై చర్చిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ నలుగురు నేతలు ఏం మాట్లాడుకొని ఉంటారు..? పరస్పరం విమర్శలకు దిగే అధికార, ప్రతిపక్ష నేతలను ఇలా చూడటం అరుదు.. అంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. అధికార, ప్రతిపక్షాలు ఇలాగే స్నేహపూర్వకంగా మెలుగుతూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - Mar 28 , 2026 | 05:23 AM