బీజేపీ విధానాలతో మహిళలపై పెరుగుతున్న హింస
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:34 AM
దేశంలో మహిళలపై హింస పెరిగిపోయిందని, చిన్న పిల్లలకూ లైంగిక వేధింపులు తప్పడం లేదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం...
25-28 మధ్య హైదరాబాద్‌లో ఐద్వా జాతీయ మహాసభలు
ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే
పంజాగుట్ట, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): దేశంలో మహిళలపై హింస పెరిగిపోయిందని, చిన్న పిల్లలకూ లైంగిక వేధింపులు తప్పడం లేదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 25 నుంచి 28 వరకు హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ఐద్వా 14వ అఖిల భారత మహాసభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పి.కె.శ్రీమతి టీచర్, కోశాధికారి ఎస్.పుణ్యవతి, కేంద్ర కమిటీ సభ్యులు షెర్బానీ, రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్. అరుణ జ్యోతి, ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, సహాయ కార్యదర్శులు కె.ఎన్.ఆశాలత, బుగ్గవీటి సరళలతో కలిసి శుక్రవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మరియం ధావలే మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మనుస్మృతి అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేంద్ర విధానాల వల్లే మహిళలపై హింసతోపాటు పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించిన పోక్సో కేసులు పెరిగాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ మహాసభలలో భాగంగా ఈ నెల 24న సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఏర్పాటు చేస్తున్న ఫొటో ఎగ్జిబిషన్‌ను రాష్ట్ర మంత్రి సీతక్క ప్రారంభిస్తారని తెలిపారు. 25న సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నుంచి వేలాదిమందితో ర్యాలీ నిర్వహించనున్న తెలిపారు.