Share News

kumaram bheem asifabad- అభివృద్ధికి దూరంగా పల్లెలు

ABN , Publish Date - Jan 20 , 2026 | 10:28 PM

మండలంలోని పల్లెలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. మండల కేంద్రం నుంచి గ్రామాలకు వెళ్లేందుకు రోడ్ల నిర్మాణం లేదు. వంతెన నిర్మాణం సైతం చేపట్టక ఏటా వర్షాకాలంలో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

kumaram bheem asifabad- అభివృద్ధికి దూరంగా పల్లెలు
తిర్యాణి మండలంలోని చింతలమాదర జలపాతం(ఫైల్‌)

- పట్టించుకోని పాలకులు, అధికారులు

తిర్యాణి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పల్లెలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. మండల కేంద్రం నుంచి గ్రామాలకు వెళ్లేందుకు రోడ్ల నిర్మాణం లేదు. వంతెన నిర్మాణం సైతం చేపట్టక ఏటా వర్షాకాలంలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఏజెన్సీ మండలంలో నూతనంగా బాఽధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లకు ఏడేళ్ల తరువాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. 29 పంచాయతీలలో ఎన్నికల్లో అధికార పార్టీ, బీఆర్‌ఎస్‌ హోరాహోరిగా తలపడ్డాయి 17 స్థానాల్లో కాంగ్రెస్‌, 10 స్థానాల్లో బీఆర్‌ఎస్‌, రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. కాగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లకు మండలంలో పేరుకు పోయిన సమస్య లు స్వాగతం పలుకుతున్నాయి. దాదాపు జిల్లాలోనే అన్ని మండలాలతో పోల్చితే ఇప్పటికీ వివిధ రంగాలలో అత్యంత వెనకబడి ఉన్న ఏజెన్సీ మండ లాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతిని ధులు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు ఆవేదన చెందు తున్నారు. అయితే నూతన సర్పంచ్‌లు ఏ మేరకు గ్రామాలను అభివృద్ధి చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మండలం అభివృద్ధి కోసం సింగరే ణి సంస్థ నుంచి డీఎంఎఫ్‌టీ ఫండ్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీగా నిధులు మంజూరు అవుతున్నప్పటికీ వాటిని సక్రమంగా వినియోగించక పోవడంతో మండల అభివృద్ధికి ఆమడ దూరంలో నిలుస్తోంది.

- అసంపూర్తిగా పనులు..

మండల కేంద్రం నుంచి సుమారు 50 శాతం గ్రామాలకు వెళ్లేందుకు కనీస రోడ్డు సౌకర్యం లేదు. వర్షాకాలం వచ్చిందంటే గుండాల, మంగి, కౌటగాం, గీసిగూడ, గోపెర, కౌటగాం, బీంరెలల, బుగ్గరామన్న గూడెం, తాటిగూడ, గోవెన, నాయకపుగూడ, కుర్సిగూడ గ్రామాల ప్రజలకు కాలినడకనే శరణ్యం అవుతుంది. చాలా గ్రామాలకు మధయలో ఉండే వాగులు వద్ద వంతెనలు నిర్మించక పోవడంతో ఉప్పొంగే సమయంలో బహ్య ప్రపంచంతో సంబంధా లు తెగిపోతున్నాయి. ఏళ్లుగా చిన్న చిన్న మరమ ్మతులు చేస్తున్నారే తప్ప. నూతన రోడ్ల నిర్మాణం చేపట్టడం లేదు. నాయకపుగూడ గ్రామానికి నేటికి విద్యుత్‌ సరఫరా లేదు. నాయకపుగూడ నుంచి దుగ్గపూర్‌ మధ్యలో ఉన్న వాగుపై మూడేళ్లుగా నిర్మిం చిన వంతెన అసంపూర్తిగా దర్శనమిస్తోంది. అం తే కాకుండా మండల కేంద్రంలోని ప్రతి శుక్రవారం నిర్వహించే వార సంతను ప్రైవేటు వ్యక్తులు నిర్వ హించడంతో అదాయం కోల్పోతుంది.

- పర్యాటకంపై పట్టింపు కరువు..

చింతలమాదర, గుండాల, ఉల్లిపిట్ట అనే మూడు అందమైన జలపాతాలు ఉండగా వీటిని చూసేందుకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబా ద్‌తో పాటు మహారాష్ట్ర నుంచి సైతం అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. చుట్టూ ఎత్తైన పచ్చని గుట్టలు... పక్షుల కిలకిలరావాలు.. గలగల పారే సెలయేటి సవ్వళ్లు.. గుట్టల మీది నుంచి కిందికి జాలువారుతున్న నీటి సెలయేర్లు ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా పర్యాటకులను మనసుకు హద్దుకునే జలపాతాలు. పర్యాటక ప్రేమికులకు కనబడకుండా అటవీ తల్లి ఒడిలో ఎన్నో జలపాతాలు ఉన్నాయి. ఈ దృశ్యా లు ఓ అద్భుతం. అది ఒక ప్రకృతి సోయగం. ఇలాంటి సుందర క్షేత్రాలకు ఆదరణ కొరవడడంతో పర్యాటక ప్రేమికులకు తెలియకుండా మరుగున పడిపోతున్నాయి. ప్రభుత్వం ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఈ అందాల జలపాతాలను గుర్తించి పర్యాటకంగా అభివృద్ధి పరిచినట్లయితే పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లనున్నాయి. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించడం ద్వారా పరోక్షంగా మండల వాసులకు ఉపాధి దక్కనుంది.

Updated Date - Jan 20 , 2026 | 10:28 PM