ఇసుక క్వారీలు ప్రారంభించాలని గ్రామస్థుల ఆందోళన
ABN , Publish Date - Oct 15 , 2026 | 11:39 PM
మండలంలోని కొల్లూరు సమీ పంలోని గోదావరి నదిలో ఇసుక క్వారీలను ప్రారంభించాలని కోరుతూ గురువారం 63వ నెంబరు జాతీయ రహదారిపై కొల్లూరు గ్రామస్థులు బైఠా యించి ఆందోళన చేపట్టారు.
-ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన
కోటపల్లి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కొల్లూరు సమీ పంలోని గోదావరి నదిలో ఇసుక క్వారీలను ప్రారంభించాలని కోరుతూ గురువారం 63వ నెంబరు జాతీయ రహదారిపై కొల్లూరు గ్రామస్థులు బైఠా యించి ఆందోళన చేపట్టారు. క్వారీల వల్ల ప్రతి నిత్యం తమకు ఉపాధి దొరుకుతూ ఉండేదని, ప్రస్తుతం క్వారీలు ప్రారంభించకపోవడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన ఉన్నతా ధికారులు ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు ఇక్కడి ఇసుక క్వారీలను ప్రారంభించకుండా తమపై కక్షగట్టి ఉపాధి లేకుండా చూస్తున్నారని ఆరోపిం చారు. కొల్లూరు సమీంపలోని గోదావరి నది పరివాహక ప్రాంతంలో నాణ్య మైన ఇసుక ఉన్నా క్వారీలో ప్రారంభించకపోవడం ఎంత వరకు సమం జసమని వారు ప్రశ్నించారు. సుమారు 500 కుటుంబాలకు ఇసుక క్వారీల వల్ల ఉపాధి దొరికేదని, ప్రస్తుతం ఉపాధి కరువైందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఇసుక క్వారీలను ప్రారంభించి తమకు ఉపాధి కల్పించాలని వారు కోరారు. రోడ్డుపై ఆందోళన నిర్వహించడంతో సుమారు గంట సేపు ఎటు వాహనాలు అటే నిలిచిపోయాయి.